13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..

Date:

ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను పది నుంచి పన్నెండుకు పెంచే ఆలోచన ప్రస్తుతం బీసీసీఐకి లేదని బోర్డు కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా స్పష్టం చేశారు. 2028 నాటికి ఐపీఎల్‌లో జట్లను పెంచుతారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దీనిపై బోర్డులో ఎలాంటి అధికారిక లేదా అనధికారిక చర్చ జరగలేదని తేల్చిచెప్పారు. మీడియాలో వస్తున్న ఇటువంటి కథనాలు కేవలం కొన్ని ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం బోర్డు దృష్టి అంతా 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ సీజన్ వేడుకలపైనే ఉందని, ఆ ఏర్పాట్లలోనే తాము నిమగ్నమయ్యామని ఆయన తెలిపారు.

మరోవైపు, దేశీయ క్రికెట్‌కు సంబంధించి మేఘాలయ క్రికెట్ సంఘంలో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా సైకియా స్పష్టతనిచ్చారు. ఈశాన్య ప్రాంత మహిళా సెలక్షన్ కమిటీ సంయోజకుడిగా ఖర్కామ్నీ నియామకంలో బీసీసీఐకి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఆ నియామకాన్ని పూర్తిగా రాష్ట్ర క్రికెట్ సంఘమే చేపట్టిందని, అయితే వివాదాస్పద నేపథ్యం ఉన్న ఆ నియామకం గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. మొత్తంగా ఐపీఎల్ విస్తరణ వార్తలను బీసీసీఐ తోసిపుచ్చడంతో రాబోయే సీజన్లలో ప్రస్తుతమున్న పది జట్లే కొనసాగనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍; 9.60 കോടിയുടെ 24 ഇന്നോവകള്‍ വാങ്ങാന്‍ സര്‍ക്കാര്‍

തിരുവന്തപുരം: മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍ വാങ്ങാന്‍ വി.ഡി. സതീശന്‍...

"மேக்கேதாட்டு அணை கட்ட சட்ட ரீதியாக உதவுங்கள்" – மோடியிடம் உதவி கேட்ட DK சிவகுமார்

மேக்கேதாட்டு அணை கட்டுவதை மிகத் தீவிரமாக முன்னெடுத்து வருகிறார் கர்நாடகா முதலமைச்சர்...

Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!

Iran Crisis: ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికాతో యుద్ధం, అంతర్జాతీయ...

യു.ഡി.എഫ് സർക്കാരിനെ നയിക്കുന്നത് നെഹ്‌റുവിന്റെ ആശയങ്ങളല്ല, ഗീബൽസിന്റെ നുണപ്രചാരണ തന്ത്രങ്ങൾ: പിണറായി വിജയൻ

കാലടി: കാലടി സംസ്കൃത സർവകലാശാലയിലെ വിദ്യാർത്ഥി സമരത്തിന് പൂർണ പിന്തുണ പ്രഖ്യാപിച്ച്...