13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!

Date:

Iran Crisis: ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికాతో యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షలు ఆ దేశానికి తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, అప్పుల భారాన్ని భరించలేక కొందరు తమ శరీర భాగాలను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జ, వృషణాలను కూడా అమ్మకానికి పెడుతున్నట్లు ఇరాన్ వార్తాసంస్థ ILNA వెల్లడించింది.

మధ్య ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గోడలపై అవయవాలు అమ్ముతామని ప్రకటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘‘కిడ్నీ స్ట్రీట్’’గా పిలిచే ఫర్హంగ్ హెస్సేనీ వీధిలో ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే మున్సిపల్ వైద్య కేంద్రం, కిడ్నీ రోగులకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ ఉండటంతో అవయవాలను కొనుగోలు చేయాలనుకునే వారు అక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రజలు తమ అవయవాలను అమ్ముకునేందుకు వస్తున్నారని అక్కడి ఆస్పత్రి ఉద్యోగులు చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్‌ను బట్టి ధర మారుతుందని, అరుదైన బ్లడ్ గ్రూప్‌లకు ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని చెబుతున్నారు. కిడ్నీ ధరలు సుమారు 30 బిలియన్ నుంచి 40 బిలియన్ ఇరానియన్ రియాళ్ల వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది సుమారు 11,500 నుంచి 15,300 అమెరికన్ డాలర్లకు సమానం. కిడ్నీలే కాకుండా ఇతర శరీర అవయవాలను అమ్మేసి అప్పులు తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍; 9.60 കോടിയുടെ 24 ഇന്നോവകള്‍ വാങ്ങാന്‍ സര്‍ക്കാര്‍

തിരുവന്തപുരം: മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍ വാങ്ങാന്‍ വി.ഡി. സതീശന്‍...

"மேக்கேதாட்டு அணை கட்ட சட்ட ரீதியாக உதவுங்கள்" – மோடியிடம் உதவி கேட்ட DK சிவகுமார்

மேக்கேதாட்டு அணை கட்டுவதை மிகத் தீவிரமாக முன்னெடுத்து வருகிறார் கர்நாடகா முதலமைச்சர்...

യു.ഡി.എഫ് സർക്കാരിനെ നയിക്കുന്നത് നെഹ്‌റുവിന്റെ ആശയങ്ങളല്ല, ഗീബൽസിന്റെ നുണപ്രചാരണ തന്ത്രങ്ങൾ: പിണറായി വിജയൻ

കാലടി: കാലടി സംസ്കൃത സർവകലാശാലയിലെ വിദ്യാർത്ഥി സമരത്തിന് പൂർണ പിന്തുണ പ്രഖ്യാപിച്ച്...

சிவகங்கை: துபாயில் தகவல் தொடர்பு துண்டிப்பு; கொல்கத்தாவில் வழிப்பறி- மீண்டது எப்படி? 18 நாள் திகில்!

வெளிநாட்டில் உழைத்துவிட்டுத் தாயகம் திரும்பும் ஆசையில் விமானம் ஏறக் காத்திருந்த கணவர்...