29
June, 2026

A News 365Times Venture

29
Monday
June, 2026

A News 365Times Venture

AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!

Date:

AFG vs IND: న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ వేదికలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు సుతార్‌. సాయి సుదర్శన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడం ద్వారా టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకాన్ని కొనసాగించింది.

టాస్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వాతావరణం వేడిగా ఉందని, కాలక్రమేణా పిచ్ నెమ్మదించే అవకాశం ఉన్నందున ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తాను ఈ ప్రాంతానికి సమీపంలో పెరిగానని, స్వస్థలానికి దగ్గరలో టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే ఈ మ్యాచ్‌తో పాటు ముందున్న తొమ్మిది టెస్టులను దృష్టిలో పెట్టుకుని సరైన కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని వెల్లడించాడు.

మరోవైపు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌లో తమకు ఎక్కువ అవకాశాలు రాకపోయినా, ప్రతి సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. కాబూల్‌లో నిర్వహించిన ప్రిపరేషన్ క్యాంప్ తమకు ఎంతో ఉపయోగపడిందని, కొత్త కోచ్ రిచర్డ్ పైబస్ మార్గదర్శకత్వంలో మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆశిస్తున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తరఫున ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ నంగేయాలియా ఖరోటే అరంగేట్రం చేస్తున్నాడు.

పిచ్ పరిస్థితుల గురించి మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ, వికెట్ అద్భుతంగా కనిపిస్తోందని, తొలి రెండు రోజులు బ్యాటర్లకు స్వర్గధామంలా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్ క్రమంగా దెబ్బతిని స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని చెప్పాడు. తీవ్ర ఎండల కారణంగా పిచ్‌పై గడ్డి పొర కనిపిస్తున్నప్పటికీ, బ్యాటర్లు కుదురుకుంటే భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశముందని అన్నారు.

జట్లు ప్లేయింగ్ XI:

భారత్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, బి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మనవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

అఫ్గానిస్థాన్ ప్లేయింగ్ XI:
సెదీకుల్లా అతల్, రహ్మనుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియౌర్ రెహ్మాన్, మహ్మద్ సలీమ్.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചരിത്രകാരന്‍മാര്‍ ഇന്ത്യയെ 2014ന് മുമ്പും ശേഷവും എന്നിങ്ങനെ വിഭജിക്കും: അമിത് ഷാ

ഗാന്ധിനഗര്‍: ഭാവിയിലെ ചരിത്രകാരന്മാര്‍ ഇന്ത്യയുടെ വളര്‍ച്ചയെ 2014ന് മുമ്പും അതിനുശേഷവും എന്നിങ്ങനെ...

அமைச்சர் சரத் குமார் வீடியோ: “விளக்கமளிக்க வேண்டும்; இல்லையெனில் பதவி விலக வேண்டும்" – தமிழிசை

தவெக அமைச்சர் சரத் குமார் போதைப்பொருள் பயன்படுத்தியது போன்ற வீடியோ ஒன்று...

Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!

Hyderabad: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఉండే ప్రముఖ రెస్టారెంట్ల అసలు...

ലെബനനില്‍ നിന്നുള്ള ഇസ്രഈല്‍ പിന്മാറ്റം: സമയക്രമം നിശ്ചയിക്കാന്‍ ഇറാന്റെ ആവശ്യം

  ടെഹ്റാന്‍: ലെബനനിലെ അധിനിവേശ പ്രദേശങ്ങളില്‍ നിന്ന് ഇസ്രഈല്‍ ഉപാധികളില്ലാതെ പിന്മാറുന്നതിനായി...