25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..

Date:

తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్, రోడ్డు, రైలు భద్రతను పటిష్టం చేయడానికి “తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో” (TG-TMARS) ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక బ్యూరోగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా తన అధికార పరిధిని కలిగి ఉంటుంది. అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం తెలంగాణలో 32 వేల కిలోమీటర్లకు పైగా రోడ్ల నెట్‌వర్క్ ఉండగా.. వాహనాల సంఖ్య 1.8 కోట్లకు పైగా చేరింది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణే లక్ష్యంగా ఈ బ్యూరో పనిచేయనుంది. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్‌లో ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు, రాష్ట్రంలో రైలు ప్రయాణ భద్రతపైనా ఈ బ్యూరో నిఘా ఉంచనుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్-1988లోని సెక్షన్ 200 ప్రకారం ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులను TG-TMARS పర్యవేక్షిస్తుంది.

ఈ బ్యూరో పరిధిలోకి హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు వంటి కీలక అంశాలు వస్తాయి. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఆధునిక అనలిటిక్స్, ప్రాసిక్యూషన్‌కు ప్రత్యేక వ్యవస్థను ఇది రూపకల్పన చేస్తుంది. రోడ్డు భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ మానిటరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర రహదారి రవాణా శాఖ జారీ చేసిన ఎలక్ట్రానిక్ మానిటరింగ్, రోడ్ సేఫ్టీ ఎస్ఓపీ (SOP)లను కచ్చితంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల్లోని ట్రాఫిక్ విభాగాలన్నింటిపై TG-TMARS పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన పనిచేసే రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పర్యవేక్షణలో ఈ బ్యూరో తన విధులను నిర్వర్తిస్తుంది. రాష్ట్ర రోడ్డు భద్రతా మండలిలో TG-TMARS డైరెక్టర్ సభ్యుడిగా వ్యవహరిస్తారు. మండలి తీసుకునే ప్రతిష్టాత్మక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత ఈ బ్యూరోపై ఉంటుంది. ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗ്യാനേഷ് കുമാറിന് കുറഞ്ഞത് പത്മഭൂഷണെങ്കിലും നല്‍കണമെന്ന് ബി.ജെ.പി നേതാവ്

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ കുറഞ്ഞത് ഒരു...

"நிர்வாண வீடியோவை பரப்புகிற கேவலமான ஆள் நானில்லை" – பெண் குற்றச்சாட்டு குறித்து கருப்பு முருகானந்தம்

தமிழக பாரதிய ஜனதா கட்சியின் மாநில பொதுச்செயலாளர் கருப்பு முருகானந்தம் மீது,...

‘ഫ്രീ ഫലസ്തീൻ ടൂർ’ പ്രഖ്യാപിച്ച് എഡ് ഷീറന്റെ സംഗീത പര്യടനത്തിൽ നിന്ന് പുറത്തായ റാപ്പർ മാക്ലെമോർ

ന്യൂയോർക്ക്: ഫലസ്തീന് ഐക്യദാർഢ്യം പ്രഖ്യാപിച്ചതിന്റെ പേരിൽ ബ്രിട്ടീഷ് ഗായകൻ എഡ് ഷീറന്റെ...

சூலூர்: தவெக எம்.எல்.ஏ-வை நோக்கி பொதுமக்கள் கல்வீச்சு; தடியடி நடத்திய போலீஸ் – என்ன நடந்தது?!

கோவை மாவட்டம், சூலூர் அடுத்த நாகம்ம நாயக்கன்பாளையம் பகுதியில் சுமார் 70...