19
November, 2026

A News 365Times Venture

19
Thursday
November, 2026

A News 365Times Venture

UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!

Date:

UP Congress-SP Alliance: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిణామాలు వేగం మారుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే, యూపీలో కాంగ్రెస్ 181 అసెంబ్లీ స్థానాలు కోరుతూ ఎస్పీకి సమర్పించినట్లు చెబుతున్న ఒక జాబితా లీక్ కావడం సంచలనంగా మారుతోంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ దాదాపుగా 200 స్థానాలు అడుగుతున్నట్లు గతంలో పలు నివేదికలు వచ్చాయి.

నెలన్నర క్రితమే కాంగ్రెస్ ఈ 181 స్థానాల జాబితాను అఖిలేష్‌కు అందించినట్లు తెలుస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలిచిన పలు స్థానాలను కూడా కాంగ్రెస్ తన జాబితాలో చేర్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్య వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మూడు నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు కొన్ని జిల్లాల్లో రెండు నుంచి మూడు స్థానాలు కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కనీసం ఒక స్థానంలోనైనా పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్ కోరుతున్న స్థానాల్లో పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంప్రదాయంగా బలమైన ప్రాంతాలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీలతో పాటు సహరాన్‌పూర్, ప్రయాగ్ రాజ్, వారణాసి, డియోరియా, గోరఖ్‌పూర్, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లోని పలు స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కోరుతున్న సీట్లలో 131 జనరల్, 45 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వుడ్ నియోజవర్గాలు ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സൗദി അറേബ്യയിലേക്കുള്ള വിമാന സര്‍വീസുകള്‍ റദ്ദാക്കി ഇന്‍ഡിഗോ; യാത്രക്കാരുടെയും ജീവനക്കാരുടെയും സുരക്ഷയ്ക്ക് മുന്‍ഗണന

ന്യൂദല്‍ഹി: സുരക്ഷാ സാഹചര്യം കണക്കിലെടുത്ത് സൗദി അറേബ്യയിലെ നാല് പ്രധാന നഗരങ്ങളിലേക്കുള്ള...

திருப்பரங்குன்றம்: அதிரடி வாதங்களும் ஆட்சியர் தரப்பின் தடுமாற்றமும்! – நீதிமன்றத்தில் என்ன நடந்தது?

மதுரை திருப்பரங்குன்றம் மலை உச்சியில் கார்த்திகை தீபம் ஏற்றுவது தொடர்பான வழக்கு...

OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!

OTR: తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఏమైంది..? మొదట్లో వరుస సమావేశాలు...

വിദ്വേഷ രാഷ്ട്രീയം തള്ളിക്കളയണം; യു.എസിലെ ഹിന്ദു ക്ഷേത്രങ്ങൾക്കു നേരെയുള്ള ആക്രമണങ്ങളിൽ ആശങ്കയറിയിച്ച് സൊഹ്‌റാൻ മംദാനി

ന്യൂയോർക്ക്: അമേരിക്കയിൽ അടുത്ത മാസങ്ങളിലായി ഹിന്ദു ക്ഷേത്രങ്ങൾക്കു നേരെയുണ്ടാകുന്ന ആക്രമണങ്ങളിലും രാഷ്ട്രീയ...