19
November, 2026

A News 365Times Venture

19
Thursday
November, 2026

A News 365Times Venture

OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!

Date:

OTR: తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఏమైంది..? మొదట్లో వరుస సమావేశాలు పెట్టి హడావిడి చేసిన కమిటీ… తర్వాత ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్‌ అయింది? ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంగతేంటో తేల్చేందుకు స్పీకర్‌ పొడిగించిన గడువు కూడా సమీపిస్తున్నా… అట్నుంచి స్పందన లేకపోవడానికి కారణాలేంటి? ఎందుకు పని పూర్తి చేయలేకపోతున్నారు? లెట్స్‌ వాచ్‌. అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది అధికార పక్షం. దీంతో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసి చర్యలకు సిఫారసు చేయాలని ఆదేశించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌. కమిటీకి మూడు నెలల గడువు ఇచ్చి సంగతి తేల్చాలని ఆదేశించారాయన. అందుకు తగ్గట్టే… కమిటీ వేసిన తొలినాళ్ళలో వరుస సమావేశాలు పెట్టి హడావిడి చేశారు.

వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ గడువును పొడిగించారు. అలా పొడిగించిన సమయం కూడా దగ్గర పడుతున్నా… ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్‌గాని, రియాక్షన్‌గాని లేవు. కమిటీ ఏం చేసింది..? ఏం చేయబోతోందన్న క్లారిటీ లేదు. కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, గడువు కావాలని ఆయన కోరడం, అలాగే…. వీడియోలు కూడా కావాలని ఎమ్మెల్యే అడగడం… ఇస్తామంటూ కమిటీ వాయిదా వేయడం కామన్‌ అయ్యాయని చెప్పుకుంటున్నారు. దీంతో… ఎథిక్స్ కమిటీ మొదట్లో ఉన్నంత దూకుడుగా ఇప్పుడు ఎందుకు లేదు? ఎటూ తేల్చుకోలేకపోతోందా అన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. వరుసగా సమావేశాల వాయిదా కారణంగా… స్పీకర్ రెండోసారి ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతోంది. అసెంబ్లీలో ఘటన జరిగిన నాటి పరిస్థితి చూస్తే… ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై వెంటనే వేటేస్తారన్నట్టుగా నడిచింది వ్యవహారం.

ఆ తర్వాత స్పీకర్ ఎథిక్స్ కమిటీ వేయడంతో…అంతా చట్టబద్ధంగా సెట్ చేయాలని నిర్ణయించినట్లు చర్చ జరిగింది. అయితే కమిటీ నియమించి ఐదు నెలలు కావస్తున్నా.. కొలిక్కి రాకపోవడంతో …అసలేం జరుగుతోందన్న చర్చ కు స్పేస్ ఇచ్చినట్టు అయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎథిక్స్ కమిటి చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి కాస్త సంయమనంతో అడుగు వేస్తున్నారో..? లేక ఆచి తూచి వ్యవహరిస్తున్నారోగానీ… స్పీకర్‌ కమిటీరి రెండోసారి ఇచ్చిన గడువు కూడా ముగుస్తున్నా నో సౌండ్‌ అన్న చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డిపై వేటు వేస్తారంటూ ఒక దశలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే… చర్యలకు కమిటీ సిఫారసు చేస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయట ఎక్కువ మందికి. ఏదో ఒకటి తేల్చడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్కడ ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి వివిధ వర్గాల్లో.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സൗദി അറേബ്യയിലേക്കുള്ള വിമാന സര്‍വീസുകള്‍ റദ്ദാക്കി ഇന്‍ഡിഗോ; യാത്രക്കാരുടെയും ജീവനക്കാരുടെയും സുരക്ഷയ്ക്ക് മുന്‍ഗണന

ന്യൂദല്‍ഹി: സുരക്ഷാ സാഹചര്യം കണക്കിലെടുത്ത് സൗദി അറേബ്യയിലെ നാല് പ്രധാന നഗരങ്ങളിലേക്കുള്ള...

திருப்பரங்குன்றம்: அதிரடி வாதங்களும் ஆட்சியர் தரப்பின் தடுமாற்றமும்! – நீதிமன்றத்தில் என்ன நடந்தது?

மதுரை திருப்பரங்குன்றம் மலை உச்சியில் கார்த்திகை தீபம் ஏற்றுவது தொடர்பான வழக்கு...

വിദ്വേഷ രാഷ്ട്രീയം തള്ളിക്കളയണം; യു.എസിലെ ഹിന്ദു ക്ഷേത്രങ്ങൾക്കു നേരെയുള്ള ആക്രമണങ്ങളിൽ ആശങ്കയറിയിച്ച് സൊഹ്‌റാൻ മംദാനി

ന്യൂയോർക്ക്: അമേരിക്കയിൽ അടുത്ത മാസങ്ങളിലായി ഹിന്ദു ക്ഷേത്രങ്ങൾക്കു നേരെയുണ്ടാകുന്ന ആക്രമണങ്ങളിലും രാഷ്ട്രീയ...

ஊடகவியலாளர் அருண் ராம்: “இது பாசிசமா பாயாசமா?" – முதல்வர் விஜய்யிடம் கேள்வி எழுப்பும் ஸ்டாலின்!

டைம்ஸ் ஆப் இந்தியா நாளேட்டின் ஆசிரியர்களில் ஒருவரான அருண் ராம், `Hero's...