17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..

Date:

ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆదివారం అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 135 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఓపెనర్ టామ్ బాంటన్ (121) అద్భుత సెంచరీతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. కేవలం రెండు రోజుల క్రితమే పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో 131 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌లో పూర్తి భిన్నంగా ఆడి భారీ స్కోరు సాధించింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. 19 పరుగుల వద్దే బెన్ డకెట్ అవుట్ అయినా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇంగ్లాండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. టామ్ బాంటన్, జో రూట్ (62) రెండో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక రెండో వికెట్ భాగస్వామ్యం. బాంటన్ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేసి తన రెండో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో వికెట్ కీపర్ జోర్డాన్ కాక్స్ (67), విల్ జాక్స్ (54 నాటౌట్) వేగంగా ఆడగా, ఆఖరి ఓవర్లో గస్ అట్కిన్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేసింది.

356 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్లు గస్ అట్కిన్సన్ (4/27), సోనీ బేకర్ (1/43) నిప్పులు చెరగడంతో ఆసీస్ ఏడు ఓవర్లలోనే 29 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, కూపర్ కొనోలీ, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో మాట్ రెన్షా (63), కామెరూన్ గ్రీన్ (64) కొంతసేపు పోరాడినప్పటికీ, రన్‌రేట్ పెరిగిపోవడంతో ఆసీస్ ఒత్తిడికి గురైంది. చివరికి జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన యార్కర్‌తో స్పెన్సర్ జాన్సన్‌ను బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 220 పరుగులకే ఆలౌట్ అయింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే బుధవారం హోబర్ట్ వేదికగా జరగనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അജിത് പവാറിന്റെ മരണം; വിമാനം ഓപ്പറേറ്റ് ചെയ്ത കമ്പനിയുടെ ഉടമയെ ഫട്‌നാവിസ് സംരക്ഷിക്കുന്നു: രോഹിത് പവാര്‍

മുംബൈ: മഹാരാഷ്ട്ര മുന്‍ ഉപമുഖ്യമന്ത്രി അജിത് പവാര്‍ അപകടത്തില്‍ മരിക്കാനിടയായ വിമാനം...

சாட்ஜிபிடி மூலம் புத்தகங்கள்; ஒரே நாளில் ISBN பெற்ற நூல்கள், அதே நாளில் ஒப்புதல்! – FIR முழு விவரம்!

தமிழ்நாடு பொது நூலக இயக்ககம் மற்றும் கோவை பெரியார் அறிவுலகம் உள்ளிட்ட...

Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం

దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రధానమంత్రి...

രാജ്യത്ത് ആദിവാസികള്‍ ആരുമില്ലെന്ന് ബി.ജെ.പി എം.എല്‍.എ; ബി.ജെ.പിയുടെ ആദിവാസി വിരുദ്ധത വെളിപ്പെട്ടെന്ന് കോണ്‍ഗ്രസ്

ഭോപ്പാല്‍: രാജ്യത്ത് ആദിവാസികള്‍ എന്ന് ആരുമില്ലെന്ന പരാമര്‍ശവുമായി മധ്യപ്രദേശിലെ ബി.ജെ.പി എം.എല്‍.എ...