14
November, 2026

A News 365Times Venture

14
Saturday
November, 2026

A News 365Times Venture

YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..

Date:

చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న అభివృద్ధి ప్రచారానికి, రాష్ట్రంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని తప్పుడు ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనడానికి విద్యుత్ డిమాండ్ తగ్గుదల స్పష్టమైన నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ఏపీఈఆర్‌సీ గణాంకాల ప్రకారం 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి డిస్కంల విద్యుత్ విక్రయాలు, పంపిణీ తగ్గిపోయినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు, గృహ వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. కానీ ఏపీలో డిమాండ్ తగ్గడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్ర మందగమనానికి అద్దం పడుతోందని వివరించారు.

విద్యుత్ రంగంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా కుంటుపడిందని కాగ్ గణాంకాలను ఉదహరించారు. 2023-24లో రూ.85,922 కోట్లుగా ఉన్న రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, 2025-26 నాటికి రూ.86,552 కోట్లకు మాత్రమే చేరిందని తెలిపారు. రెండేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు కేవలం 0.15 శాతం మాత్రమే ఉండటం రాష్ట్రంలో పెట్టుబడులు పడిపోయాయనేదానికి నిదర్శనమన్నారు.

ఈ ఆర్థిక మందగమనం ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2026-27 తొలి త్రైమాసికంలో దేశంలో నాలుగో స్థానంలో ఉన్న నిరుద్యోగం, రెండో త్రైమాసికానికి రెండో స్థానానికి ఎగబాకిందని తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా 23 లక్షల ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വംശഹത്യയ്ക്ക് ഊര്‍ജം പകരുന്നു; തുര്‍ക്കിയിയില്‍ നിന്ന് ഇസ്രഈലിലേക്കുള്ള എണ്ണ കയറ്റുമതി അവസാനിപ്പിക്കണം: ഗ്രേറ്റ

അങ്കാറ: തുര്‍ക്കിയിലെ തുറമുഖങ്ങളില്‍ നിന്ന് ഇസ്രഈലിനായി ഇന്ധനം കയറ്റുമതി ചെയ്യുന്നത് അവസാനിപ്പിക്കണമെന്ന്...

திருப்பரங்குன்றம்: "'தீபத் தூண்' கட்டுக்கதை; நூற்றாண்டு மரபு மாறாது"- உச்ச நீதிமன்றத்தில் தமிழக அரசு

மதுரை திருப்பரங்குன்றம் சுப்பிரமணியசுவாமி கோயில் மலை உச்சியில் கார்த்திகை தீபம் ஏற்றுவது...

മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍; 9.60 കോടിയുടെ 24 ഇന്നോവകള്‍ വാങ്ങാന്‍ സര്‍ക്കാര്‍

തിരുവന്തപുരം: മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍ വാങ്ങാന്‍ വി.ഡി. സതീശന്‍...

"மேக்கேதாட்டு அணை கட்ட சட்ட ரீதியாக உதவுங்கள்" – மோடியிடம் உதவி கேட்ட DK சிவகுமார்

மேக்கேதாட்டு அணை கட்டுவதை மிகத் தீவிரமாக முன்னெடுத்து வருகிறார் கர்நாடகா முதலமைச்சர்...