2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..

Date:

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ సంఖ్యలో హిందువుల పేర్లు గల్లంతయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సుమారు 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవని చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో చేర్చేలా బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. బూత్ స్థాయి అధికారులతో (BLOs) సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోవడం వల్ల రాష్ట్రంలోని 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనపడుతోందని యోగి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 13 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో 66 లక్షల మంది పేర్లు లేవని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న 55 లక్షల మంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేవని ఆరోపించారు. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న సుమారు 4.5 లక్షల మంది యువ ఓటర్ల పేర్లు కూడా జాబితాలో లేవని చెప్పారు.

గతంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో యూపీ ఓటర్ జాబితాలో కేవలం 4 లక్షల మంది పేర్లు మాత్రమే కొత్తగా చేరాయని, ఈసారి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. హిందూ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.

ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 2.04 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. ఈ తొలగింపులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యాయని, వీరిలో మహిళలు అధిక శాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 84 లక్షలకు పైగా కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చారు. దీంతో ఉత్తరప్రదేశ్ తుది ఓటర్ల సంఖ్య 13,39,84,792కు చేరింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സിദ്ധരാമയ്യ സ്റ്റിങ് ക്യാമറ ഓപ്പറേഷന്‍ വിവാദം: ഉപയോഗിച്ച ഫോണ്‍ കൈമാറിയത് കേന്ദ്രമന്ത്രിയുടെ വസതിയില്‍ വെച്ചാണെന്ന് റിപ്പോര്‍ട്ട്

ന്യൂദല്‍ഹി: കര്‍ണാടക മുന്‍ മുഖ്യമന്ത്രി സിദ്ധരാമയ്യയ്‌ക്കെതിരെ സ്റ്റിങ് ഓപ്പറേഷന്‍ നടത്താന്‍ ഉപയോഗിച്ച...

“தமிழ்நாட்டுக்கென தனிக்கொடி" – அமைச்சர் ஆதவ் அர்ஜுனா பேசியது என்ன?

இந்தியாவில் உள்ள பல்வேறு மாநிலங்களைப் போல, தமிழை முதன்மைப்படுத்தி தமிழ்நாட்டிற்கும் ஒரு...

புதுக்கோட்டை பஸ் ஸ்டாண்ட் திறப்பு விழா; திமுக கொண்டாட்டம்; லட்டுகளை தட்டோடு பறிமுதல் செய்த போலீஸ்

புதுக்கோட்டையில் ரூ.19 கோடி செலவில் புதிதாகக் கட்டப்பட்டுள்ள புதிய பேருந்து நிலையம்...