1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..

Date:

Omar Abdullah: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పెళ్లి జరిగిన మరుసటి రోజే నిధి రజ్దాన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి రజ్దాన్‌ను ట్యాగ్ చేస్తూ ఒమర్ అబ్దుల్లా ఓ ఫొటోను పోస్టు చేశారు. “నిన్న ఒక కొత్త ప్రయాణం ప్రారంభమైంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

విడాకులు తీసుకున్న 3 నెలలకే పెళ్లి..

ఒమర్ అబ్దుల్లాకు అంతకు ముందు పాయల్ అబ్దుల్లాతో వివాహమైంది. వీరిద్దరికి మూడు నెలల క్రితమే సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. 2026 జూలై 31న ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లా పరస్పర అంగీకారంతో తమ వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడంతో పాటు, ఒకరిపై ఒకరు దాఖలు చేసిన కేసుల్ని విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. వీరిద్దరి వివాహాన్ని రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

1994లో ఒమర్, పాయల్ వివాహం..

ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లాలు 1994లో వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వీరికి జాహిర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2009 నుంచి ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. 2011లో తాము విడిపోయిన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా వీరిద్దరు చాలా కాలంగా విడివిడిగా ఉంటున్న విషయాన్ని గుర్తించింది. ఇప్పుడు జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో వివాహం జరిగినట్లు ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ వార్త రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

புதுக்கோட்டை பஸ் ஸ்டாண்ட் திறப்பு விழா; திமுக கொண்டாட்டம்; லட்டுகளை தட்டோடு பறிமுதல் செய்த போலீஸ்

புதுக்கோட்டையில் ரூ.19 கோடி செலவில் புதிதாகக் கட்டப்பட்டுள்ள புதிய பேருந்து நிலையம்...

കാലടി സര്‍വകലാശാലയിലെ സമരം; വിദ്യാര്‍ത്ഥികളെ പരീക്ഷയെഴുതിക്കില്ലെന്ന നിലപാടിനെതിരെ നിരാഹാര സമരം ആഹ്വാനം ചെയ്ത് എസ്.എഫ്.ഐ

എറണാകുളം: കാലടി സര്‍വകലാശാലയില്‍ സമരം ചെയ്ത വിദ്യാര്‍ത്ഥികളെ പരീക്ഷയെഴുതാന്‍ അനുവദിക്കണമെന്ന് കോടതി...

"அன்பில் கைதுக்கு காரணமானவரோடு தருமபுரி எம்.பி காட்டும் நெருக்கம்!" – கொந்தளிக்கும் திமுக-வினர்!

   "தி.மு.க ஆட்சிக்கு களங்கத்தை ஏற்படுத்தும் வகையில் புகார் கொடுத்தவரின் நிறுவனம்...