23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!

Date:

SA vs AUS: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య గ్కెబెర్హాలో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాకు 326 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 28 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. ట్రావిస్ హెడ్ 14, మార్నస్ లబుషేన్ 14, మ్యాట్ రెన్‌షా 12, బ్యూవ్ వెబ్‌స్టర్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఆస్ట్రేలియా 42.3 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 11 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అతనికి తోడుగా కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో 2 వికెట్లు, అన్రిచ్ నోర్జే ఒక వికెట్ సాధించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కెప్టెన్ టెంబా బవుమా కీలక పాత్ర పోషించాడు. అతడు 334 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్ తో 179 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి మార్కో జాన్సెన్ 85, సైమన్ హార్మర్ 82 పరుగులతో సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా 127.1 ఓవర్లలో 425/9 వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 5 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశారు. అయితే దక్షిణాఫ్రికా భారీ స్కోరును అడ్డుకోవడంలో మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై పట్టు బిగించింది.

మొదటి టెస్టులో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రిక.. రెండో టెస్ట్ లో మాత్రం తన ఫామ్ ఏంటో చూపించింది. ప్రస్తుతానికి ఫాలో ఆన్ కారణంగా రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 23 ఓవర్లలో 1 వికెట్‌కు 73 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా కంటే ఇంకా 253 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ టెస్టులో పుంజుకోవాలంటే తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసేందుకు ఈ మ్యాచ్‌లో గెలుపుపై కన్నేయగా.. ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈല്‍ ബന്ധം: വിവരസുരക്ഷാ ആശങ്കകള്‍ ചൂണ്ടിക്കാട്ടി സര്‍ക്കാര്‍ ഉദ്യോഗസ്ഥര്‍ക്ക് നാവിഗേഷന്‍ ആപ്പ് ഉപയോഗിക്കുന്നതിന് വിലക്ക്

ക്വാലാലംപൂര്‍: ഇസ്രഈലുമായി ബന്ധമുള്ളതിനാല്‍ സുരക്ഷാ ആശങ്കകള്‍ ചൂണ്ടിക്കാട്ടി നാവിഗേഷന്‍ ആപ്പായ വേസ്(...

பிரியங்கா மகனின் புகைப்படக் காட்சி; 75 படங்கள் அகற்றம்; `இது ஆட்சியின் பிழை…' – காங்கிரஸ் கண்டனம்!

காங்கிரஸ் தலைவர் பிரியங்கா காந்தி வதேராவின் மகனும் புகைப்படக் கலைஞருமான ரையான்...

കന്നുകാലികളെ ബാധിക്കുന്ന ഷമോണ്ട വൈറസ് ബാധിച്ച് ഒരു മരണം: പൊതുജനങ്ങള്‍ക്ക് ആരോഗ്യപരമായ ഭീഷണിയില്ലെന്ന് ഫ്രഞ്ച് സര്‍ക്കാര്‍

ജനീവ: കന്നുകാലികളെ ബാധിക്കുന്ന ഷമോണ്ട വൈറസ് ആദ്യമായി മനുഷ്യനില്‍ കണ്ടത്തിയതായി ലോകാരോഗ്യ...

புதிய தலைமைச் செயலகம்: 'தமிழ்நாட்டில் நடப்பது மக்கள் ஆட்சியா, ஜோதிடர் ஆட்சியா?'- கனிமொழி கேள்வி

"தமிழ்நாட்டில் நடப்பது மக்கள் ஆட்சியா, ஜோதிடர் ஆட்சியா?" என்று திமுக எம்.பி...