18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?

Date:

CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా మార్చ్‌ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు.

దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..?

ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే విడుదలైతే, సీజేపీ కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లో ఇంకా జైలులోనే ఉన్నారు. దీనికి కారణం వీరు వేర్వేరు సందర్భాల్లో అరెస్ట్ కావడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అభిజిత్ దీప్కే తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చిన సెంట్రల్ పార్క్‌కు చేరుకోకముందే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కానీ అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు ఆంక్షలు ఉన్నప్పటికీ దొంగచాటున జంతర్ మంతర్ చేసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో సీజేపీ సభ్యుడు అజింక్య షిండేను కూడా అక్టోబర్ 13న పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, నిబంధనల్ని ఉల్లంఘించడం, అక్టోబర్ 10న జంతర్ మంతర్ నిరసన సమయంలో బాండ్ నిబంధనల్ని ఉల్లంఘించడం కారణంగా వీరికి కోర్టు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. షిండేకు వ్యక్తిగత బాండ్, పూచీకత్తు సమర్పించే షరతుతో ఆరు నెలల పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ తీసుకుని విడుదల చేశారు.

ఏ చట్టాల కింద కేసులు నమోదు..?

దీప్కే, దాస్, రాంకాలపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 170 ప్రకారం, గుర్తించదగిన నేరాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు అరెస్టు చేయవచ్చు. సెక్షన్ 126 ప్రకారం, శాంతిభద్రతలను కాపాడేందుకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బాండ్ సమర్పించాలని ఆదేశించవచ్చు. అక్టోబర్ 10న ఢిల్లీలో నిరసన సందర్భంగా ముగ్గురు కూడా శాంతిభద్రలకు విఘాతం కలిగించమని ఏడాది కాలానికి రూ. 50,000 బాండ్‌పై సంతకం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വോട്ട് മോഷണത്തിന് മോദിയും അമിത്ഷായും ഗ്യാനേഷും നിയമ നടപടി നേരിടേണ്ടി വരും: രാഹുല്‍ ഗാന്ധി

മഡ്ഗാവ്: വോട്ട് മോഷണം നടത്തിയതിന് പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയും ആഭ്യന്തര മന്ത്രി...

Chennai Rain: 'தவெக ரொம்ப ஸ்லோ; திமுக செஞ்ச வேலையினாலதான் தண்ணி நிக்கலை!' – மேயர் பிரியா!

நேற்று மாலை முதல் சென்னையில் மிகக் கனமழை பொழிந்திருந்தது. மாநகராட்சி அதிகாரிகளும்...

സൗദി അധികൃതരുടെ മുന്നറിയിപ്പുകള്‍ പാലിക്കണം: ഇന്ത്യന്‍ പ്രവാസികള്‍ക്ക് നിര്‍ദേശങ്ങളുമായി എംബസി

റിയാദ്: സൗദി സഖ്യവും യെമനിലെ ഹൂത്തി വിമതരുമായുള്ള ഏറ്റുമുട്ടല്‍ തുടരുന്നതിനിടെ സൗദിയിലെ...

Chennai Rain: அப்டேட் கேட்கும் முதல்வர்; மழை இரவில் ஆப்சென்ட் ஆன பொறுப்பு அமைச்சர்கள்- பின்னணி என்ன?

நேற்று மாலை முதல் நள்ளிரவு வரை சென்னையில் அதிகனமழை கொட்டித் தீர்த்திருக்கிறது....