18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?

Date:

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు ‘‘తేనెటీగ విషం’’ రూపంలో ఓ మార్గం కనిపించింది. తేనెటీగ విషంలోని సమ్మేళనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషంలోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ కణాలను దెబ్బతీయగలదని, వాటి పెరుగుదలను మందగించడం, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ పరిశోధలు ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

మెలిటిన్‌పై సైంటిస్టుల ఆసక్తి..

తేనెటీగ విషంలో ప్రధానం ఉండే మెలిటిన్‌ (Melittin)పై సైంటిస్టుల ఆసక్తి నెలకొంది. ఇది మొత్తం విషయంలో 40-50 శాతం వరకు ఉంటుంది. కణాల బయట పొరను దెబ్బతీసే సామర్థ్యం ఉండటంతో దీనిపై శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారు. 2020లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనల్లో ట్రిపుల్-నెగటివ్, HER2-ఎన్‌రిచ్డ్‌ రొమ్ము క్యాన్సర్ కణాలపై తేనెటీగ విషం, మెలిటిన్‌ ప్రభావాన్ని పరిశీలించారు. ఈ పదార్థాలు క్యాన్సర్ కణాల జీవన సామర్థ్యాన్ని తగ్గించగలవని పరిశోధకులు గుర్తించారు. మెలిటిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలకు తోడ్పడే EGFR, HER2 ప్రోటీన్ల సంకేత ప్రక్రియలను కూడా ప్రభావితం చేయగలదని అధ్యయనం తెలిపింది.

60 నిమిషాల్లో 100 శాతం క్యాన్సర్ కణాల్ని నాశనం చేసిందా?

తేనెటీగ విషం 60 నిమిషాల్లో 100 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన ఉంది. అయితే, అధ్యయనాలు మాత్రం దీని మద్దతు ఇవ్వడం లేదు. 2020లో పరిశోధనల్లో ఒక గంట వరకు క్యాన్సర్ కణాలపై మెలిటిన్ ప్రభావాన్ని పరిశీలించారు. ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలపై 60 నిమిషాల ప్రయోగంలో, ఆలస్య దశలో కణ మరణం (late apoptosis) లేదా కణ నాశనం (necrosis)గా వర్గీకరించిన కణాల శాతం తేనెటీగ విషం ఉపయోగించిన సమూహంలో 8.3 శాతంగా ఉండగా, మెలిటిన్‌ ఉపయోగించిన సమూహంలో 23.6 శాతంగా నమోదైంది.

దీని ప్రకారం.. కణాలకు నష్టం కలగడం, వాటి జీవన సామర్థ్యం తగ్గడం, అన్ని క్యాన్సర్ కణాలు పూర్తిగా నాశనం కావడం ఈ మూడింటిని వేర్వేరు అంశాలుగా గుర్తించాలి. వీటిని మనుషుల్లో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందని చెప్పడానికి ఆధారంగా చెప్పలేం.

జంతువులపై ట్రయల్స్..

2024లో కొన్ని జంతు అధ్యయనాలను కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీటిలో కణితి పెరుగుదల, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించే ప్రక్రియపై తేనెటీగ విష ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జంతవులపై కనిపించే ఫలితాలు మనుషుల్లో ఉంటాయని నిర్ధారించలేము. మనుషుల్లో దీని ప్రభావంపై మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.

రొమ్ము క్యాన్సర్‌కు ప్రస్తుత చికిత్సలు ఇవే..

ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ మెడిసిన్స్ వంటి చికిత్సలు ఉన్నాయి. వ్యాధి రకం, దశను బట్టి చికిత్స ఉంటుంది. తేనెటీగ విషం మాత్రం ఇంకా పరిశోధన దశల్లోనే ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കോഴിയെ പോറ്റാന്‍ കുറുക്കനെ ഏല്പിച്ചു; മായിന്‍ ഹാജിയെ വഖഫ് ബോര്‍ഡ് ചെയര്‍മാനാക്കിയതിനെതിരെ നാഷനല്‍ ലീഗ്

കോഴിക്കോട്: സംസ്ഥാന വഖഫ് ബോര്‍ഡ് പുനസംഘടിപ്പിച്ചതില്‍ വിമര്‍ശനവുമായി നാഷനല്‍ ലീഗ്. മുസ്‌ലിം...

புதுச்சேரி: "ஏரியில் வீட்டைக் கட்டிவிட்டு…" – மக்களின் மழைப் புகாருக்குச் சீறிய MLA ஜோஸ் சார்லஸ்

தென்கிழக்குப் பருவமழை தொடங்கிவிட்டதால் தமிழகத்தில் பல மாவட்டங்களுக்கு ஆரஞ்ச் அலர்ட் விடப்பட்டிருக்கிறது....

Dool In-Depth: ഭരണമാറ്റം വേണമെന്ന ആവശ്യം: ബി.ജെ.പി പറയുന്നത് പച്ചക്കള്ളം; 11 കാരണങ്ങള്‍

മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി അടക്കമുള്ള ആവശ്യങ്ങളുന്നയിച്ചാണ് രാജ്യത്ത്...

நவநீதம் பிள்ளை: `பாரதி கனவு கண்ட புதுமைப்பெண்ணுக்கு நோபல் விருது!' – பழ. நெடுமாறன் புகழாரம்!

தமிழ் வம்சாவளியை சேர்ந்த பெண்ணான நவநீதம் பிள்ளைக்கு அமைதிக்கான நோபல் பரிசு...