18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!

Date:

OTR: త్వరలోనే తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి ఉమ్మడి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల నియోజకవర్గం. మరోటి ఉమ్మడి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం జిల్లాల నియోజకవర్గం. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ… గట్టిగానే కసరత్తు చేస్తోంది. కానీ ఒక విషయంలో ఆ పార్టీలోని కొందరు ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారట. ఏంటా విషయం..? వారి నిరాశకు అసలు కారణమేంటి..? చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. సమీక్షా సమావేశాలు, అవగాహనా మీటింగ్‌లతో గ్రౌండ్‌ లెవెల్లో హడావుడి చేస్తోంది. ఉమ్మడి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల నియోజకవర్గం ఒకటి. ఉమ్మడి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం జిల్లాల నియోజకవర్గం మరోటి. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి గ్రాడ్యుయేట్‌ ఓటర్లలో పట్టు సాధించగలిగితే… అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్ని పార్టీల్లోనూ అంచనాలున్నాయి. బీజేపీ కూడా అదే ఆలోచనతో ఉందట. దీంతో బలమైన అభ్యర్థుల ఎంపికపై బీజేపీ లోతుగా కసరత్తు చేస్తోంది. అభిప్రాయ సేకరణకు కమిటీలు కూడా వేసింది. ఆ కమిటీలు సైతం నివేదికలు సమర్పించాయి. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఆ నివేదికలపై చర్చించి పేర్లను అధిష్టానానికి పంపించాల్సి ఉంటుంది.

అయితే, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ అభ్యర్థి విషయంలో బీజేపీలో గట్టి పోటీ ఉందట. అనేకమంది నేతలు ఇక్కడ్నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారట. అలా టికెట్‌ కోసం పోటీపడ్డ ఆశావహులు అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలతో నిరాశకు లోనయ్యారట. దీనంతటికీ కారణం అధిష్టానం ఆల్రెడీ అభ్యర్థిని ఫిక్స్‌ చేయడమేనట. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు పోటీ చేయడం ఖాయమైందట. ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించడం దాదాపుగా ఖరారు అయిందని మాటలు వినిపిస్తున్నాయి. అభిప్రాయ సేకరణలో ఆయన పేరే మెజారిటీ నేతలు చెప్పారట. రామచందర్‌ రావును అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించడమే మిగిలిందట. అయితే, అంతకుముందు కొందరు ఆశావహులు బీజేపీలోని కీలక నేతలను కలిశారట. పరిస్థితి అని ఆరా తీశారు. తమ ప్రయత్నాలు కొనసాగించాలా..? వద్దా..? అని అడిగారట. ఆ నేతల నుండి వద్దనే సమాధానం వచ్చిందట. రామచందర్ రావే అభ్యర్థి అవుతారని ఇండికేషన్ ఇచ్చారట. దీంతో ఆశావహులు ఆశలు చాలించుకున్నారట.

నిజానికి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం 25 మందికిపైగా నేతలు ప్రయత్నాలు చేశారట. ఇక్కడ వాతావరణం ఆ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతుండటంతో టికెట్‌ కోసం క్యూ కట్టారట నేతలు. చాలా మంది ప్రచారం కూడా ప్రారంభించారు. పోస్టర్లు, సోషల్ మీడియాలో పోస్టింగులు కూడా మొదలుపెట్టారట. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం సెంటర్లు కూడా ఓపెన్ చేశారట. కొందరైతే కార్యకర్తలు, అనుచరులతో సమావేశాలు కూడా పెట్టుకున్నారట. గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్లి మరీ ఓటు నమోదు చేయించుకోవాలని కోరారట. యాప్స్‌ కూడా తయారు చేసుకున్నారట. తీరా… రామచందర్ రావే అభ్యర్థి అవుతారని క్లారిటీ రావడంతో వాళ్ళంతా నిరాశకు లోనయ్యారట. ఇంత పనిచేసుకున్న తర్వాత పార్టీ అధ్యక్షుడే బరిలోకి దిగుతుండటంతో చేసేదేముందని నసుగుతున్నారట. నిరాశ, అసంతృప్తికి లోనైనా అధ్యక్షులవారి కోసం పని చేయక తప్పదు కదా అని నిట్టూరుస్తున్నారట బీజేపీ నాయకులు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dool In-Depth: ഭരണമാറ്റം വേണമെന്ന ആവശ്യം: ബി.ജെ.പി പറയുന്നത് പച്ചക്കള്ളം; 11 കാരണങ്ങള്‍

മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി അടക്കമുള്ള ആവശ്യങ്ങളുന്നയിച്ചാണ് രാജ്യത്ത്...

நவநீதம் பிள்ளை: `பாரதி கனவு கண்ட புதுமைப்பெண்ணுக்கு நோபல் விருது!' – பழ. நெடுமாறன் புகழாரம்!

தமிழ் வம்சாவளியை சேர்ந்த பெண்ணான நவநீதம் பிள்ளைக்கு அமைதிக்கான நோபல் பரிசு...

திருச்சி: "விலைவாசி உயர்வைக் கட்டுப்படுத்த வேண்டும்!" – தொல்.திருமாவளவன் கோரிக்கை

விடுதலை சிறுத்தைகள் கட்சியின் தலைவரும், சிதம்பரம் நாடாளுமன்ற உறுப்பினருமான தொல்.திருமாவளவன் திருச்சி...