9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..

Date:

రైతులకు వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తి సంబంధిత అవసరాల కోసం క్రెడిట్ అందించే ఉద్దేశంతో 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా ఇందులో పెట్టుబడి కోసం క్రెడిట్ , వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలను కూడా చేర్చారు. ఈ పథకం కింద రుణ పరిమితి రైతు చేసే సాగు, పంట, బ్యాంక్ అంచనా ఆధారంగా నిర్ణయించబడుతుంది.

రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం 2006-07లో ఒక ‘సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం’ తీసుకువచ్చింది. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకం కింద రాయితీ రుణం పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు. దీని కింద 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది, దీనివల్ల వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. సమయానికి రుణం చెల్లించే రైతులకు అదనంగా 3 శాతం రీ-పేమెంట్ ఇన్సెంటివ్ లభిస్తుంది. దీనిద్వారా సకాలంలో చెల్లించే వారికి వడ్డీ రేటు 4 శాతానికి తగ్గుతుంది.

ఈ పథకం కింద లబ్ధిదారులకు రూపే కార్డ్ సదుపాయం అందించబడుతుంది. దీని ద్వారా ఫ్లెక్సిబుల్ విత్‌డ్రాయల్, డిజిటల్ పేమెంట్ , సింగిల్ టైమ్ డాక్యుమెంటేషన్ సౌకర్యం లభిస్తుంది. కమర్షియల్, ప్రాంతీయ, గ్రామీణ, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఈ సేవలు అమలవుతాయి. వ్యక్తిగత రైతులు, సంయుక్త రుణగ్రహీతలు, కౌలుదారులు, స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (JLG) ఈ పథకానికి అర్హులు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ KCC ద్వారా లబ్ధి పొందుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അംബാനിയാണോ ഇന്ത്യയുടെ മുതലാളി? സ്റ്റാര്‍ലിങ്കിന് ലൈസന്‍സ് നിഷേധിക്കുന്നതില്‍ എലോണ്‍ മസ്‌ക്

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യയില്‍ സ്‌പേസ് എക്‌സിന്റെ സ്റ്റാര്‍ലിങ്ക് സാറ്റലൈറ്റ് ഇന്റര്‍നെറ്റ് സേവനത്തിനുള്ള ലൈസന്‍സ്...

Infosys, TCS, HCL… நிறுவனங்களை சஸ்பெண்ட் செய்த US; Green Card-க்கு காத்திருப்போருக்கு அதிர்ச்சி!

அமெரிக்காவில் பணிபுரியும் இந்திய IT ஊழியர்களுக்கு முக்கியமான அதிர்ச்சி தகவல் வெளியாகியுள்ளது....

സി.ജെ.പി പ്രതിഷേധത്തിനായി പോയ എ.ഐ.എസ്.എഫ് പ്രവര്‍ത്തകരെ മധ്യപ്രദേശ് പൊലീസ് കസ്റ്റഡിയിലെടുത്തു

  ഭോപ്പാല്‍: ഒക്ടോബര്‍ പത്തിന് നടക്കാനിരിക്കുന്ന സി.ജെ.പി പ്രതിഷേധത്തിന് പുറപ്പെട്ട പൂനെയില്‍...

தஞ்சாவூர் ரயில் நிலையத்தில் பெரிய கோயில் மாதிரியில் இந்தி எழுத்துகள் – திமுக எதிர்ப்பால் அகற்றம்!

தஞ்சாவூர் ரயில் நிலையத்தில் அம்ரீத் பாரத் திட்டத்தின் கீழ் ரூ.21 கோடி...