17
September, 2026

A News 365Times Venture

17
Thursday
September, 2026

A News 365Times Venture

UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Date:

UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ. 2000 దాటిన యూపీఐ మర్చంట్ లావాదేవీలపై రూ. 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 14న దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంజన్ దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అమలు కాబోతున్న ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

కొత్త విధానాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఎండీఆర్ అమలుకు ముందు తగిన చట్టపరమైన ప్రక్రియ, పారదర్శకత, ప్రజలతో సంప్రదింపులు జరగలేదని, ప్రభుత్వం తగిన విధానం పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్-2007లోని సెక్షన్ 10ఏ కింద తీసుకున్న చర్యల చట్టబద్ధతను కూడా పిటిషనర్ ప్రశ్నించారు.

అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం..

వ్యక్తి నుంచి వ్యాపారికి (పర్సన్ టూ మర్చంట్)(P2M) లావాదేవీలపై ఎండీఆర్ అమలులోకి రాబోతోంది. రూ. 2,000 దాటిని వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. సాధారణ వినియోగదారుడు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడవని, ఇది వ్యాపారి చెల్లించే ఛార్జ్ అని కేంద్రం చెబుతోంది. వ్యక్తికి వ్యక్తి(పర్సన్ టూ పర్సన్) మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రూ. 2000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులపై కూడా ఎండీ ఆర్ ఉండదు. చిన్న వ్యాపారులు ప్రభావితంకారని కేంద్రం చెబుతోంది. నెలకు రూ. 1 లక్ష లోపు యూపీఐ ద్వారా స్వీకరించే వ్యాపారిపై కూడా ఈ ఎండీఆర్ ఛార్జీలు ఉండవని చెబుతోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಪಘಾತಕ್ಕೀಡಾದ ನರಿಯನ್ನು ರಕ್ಷಿಸಿ ಮಾನವೀಯತೆ ಮೆರೆದ ಚೆಸ್ಕಾಂ ಅಧಿಕಾರಿ..

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,17,2026 (www.justkannada.in):  ರಸ್ತೆ ಅಪಘಾತದಲ್ಲಿ ಗಾಯಗೊಂಡು ಸಾವು-ನೋವಿನ ನಡುವೆ ನರಳುತ್ತಿದ್ದ...

സഖ്യകക്ഷികൾ ഒഴിഞ്ഞുമാറുന്നു; ഹൂതികൾക്ക് മുന്നിൽ പ്രതിസന്ധിയിലായി സൗദി അറേബ്യ

റിയാദ്: യെമനിലെ ഹൂതി വിമതരുടെ ആക്രമണം വീണ്ടും ശക്തമായതോടെ സൗദി അറേബ്യ...

லண்டன் பயணம்: “முதல்வர் விஜய் செய்தியாளர்களைச் சந்தித்து…" – டி.ஆர்.பி. ராஜா அடுக்கும் கேள்விகள்

முதல்வர் விஜய் முதலீடுகளை ஈர்க்க லண்டன் பயணம் மேற்கொண்டிருந்த நிலையில், லண்டன்...

OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?

OTR: తెలంగాణ కమలంలో కొత్త ఈక్వేషన్స్‌ తెరపైకి రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో...