18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు

Date:

Elephant Death: చిత్తూరు జిల్లా పుంగనూరు, మంగళంపేట అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 ఏనుగులతో కూడిన గుంపులో ఒక మగ ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మంగళంపేట పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ ఏనుగుకు తగలడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఏనుగు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. అయితే మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం మృత ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతికి దారితీసిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.

ఏనుగు మృతిపై పవన్ కల్యాణ్‌ విచారం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chennai Rain: 'தவெக ரொம்ப ஸ்லோ; திமுக செஞ்ச வேலையினாலதான் தண்ணி நிக்கலை!' – மேயர் பிரியா!

நேற்று மாலை முதல் சென்னையில் மிகக் கனமழை பொழிந்திருந்தது. மாநகராட்சி அதிகாரிகளும்...

CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?

CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు...

സൗദി അധികൃതരുടെ മുന്നറിയിപ്പുകള്‍ പാലിക്കണം: ഇന്ത്യന്‍ പ്രവാസികള്‍ക്ക് നിര്‍ദേശങ്ങളുമായി എംബസി

റിയാദ്: സൗദി സഖ്യവും യെമനിലെ ഹൂത്തി വിമതരുമായുള്ള ഏറ്റുമുട്ടല്‍ തുടരുന്നതിനിടെ സൗദിയിലെ...

Chennai Rain: அப்டேட் கேட்கும் முதல்வர்; மழை இரவில் ஆப்சென்ட் ஆன பொறுப்பு அமைச்சர்கள்- பின்னணி என்ன?

நேற்று மாலை முதல் நள்ளிரவு வரை சென்னையில் அதிகனமழை கொட்டித் தீர்த்திருக்கிறது....