18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్

Date:

రష్యా అధ్యక్షుడు పుతిన్ సెక్యూరిటీ ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆయన కాన్వాయ్ వెళ్తుంటే పూర్తి బందోబస్త్ మధ్య వెళ్తుంటారు. అలాంటి భద్రతలో ఉన్న పుతిన్.. ఆశ్చర్యం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. వేగంగా దూసుకెళ్తున్న కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపి.. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రజలతో మమేకం అయి ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పుతిన్ ఆగస్టు 11న సైబీరియాలోని నోవోసిబిర్స్క్ నగరంలో పర్యటించారు. పుతిన్ కాన్వాయ్ వేగంగా దూసుకుపోతుంది. కొంత మంది పౌరులు రహదారి పక్కన నిశ్శబ్దంగా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అద్భుతం జరిగింది. డజన్ల కొద్దీ వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు ప్రక్కన ఆగిపోయాయి. నల్లటి విలాసవంతమైన కార్లు, భద్రతా వాహనాల నుంచి అంగరక్షకులు కిందకు దిగారు. పుతిన్ స్వయంగా కారు దిగి జనసమూహంతో ముచ్చటించడం ప్రారంభించారు. వారితో రష్య భాషలో సంభాషిస్తూ కనిపించారు. పుతిన్ షర్టు, టై ధరించి ఉన్నారు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి దగ్గరకు నేరుగా నడుచుకుంటూ వచ్చారు. పుతిన్ రాకతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. కొన్ని వారాల క్రితం నాటి పుతిన్ వీడియోను రష్యా టుడే తన ఎక్స్-మెన్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రజలు దానిని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വോട്ട് മോഷണത്തിന് മോദിയും അമിത്ഷായും ഗ്യാനേഷും നിയമ നടപടി നേരിടേണ്ടി വരും: രാഹുല്‍ ഗാന്ധി

മഡ്ഗാവ്: വോട്ട് മോഷണം നടത്തിയതിന് പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയും ആഭ്യന്തര മന്ത്രി...

Chennai Rain: 'தவெக ரொம்ப ஸ்லோ; திமுக செஞ்ச வேலையினாலதான் தண்ணி நிக்கலை!' – மேயர் பிரியா!

நேற்று மாலை முதல் சென்னையில் மிகக் கனமழை பொழிந்திருந்தது. மாநகராட்சி அதிகாரிகளும்...

CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?

CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు...

സൗദി അധികൃതരുടെ മുന്നറിയിപ്പുകള്‍ പാലിക്കണം: ഇന്ത്യന്‍ പ്രവാസികള്‍ക്ക് നിര്‍ദേശങ്ങളുമായി എംബസി

റിയാദ്: സൗദി സഖ്യവും യെമനിലെ ഹൂത്തി വിമതരുമായുള്ള ഏറ്റുമുട്ടല്‍ തുടരുന്നതിനിടെ സൗദിയിലെ...