20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..

Date:

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చారిత్రాత్మక గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య జట్టును భారత్ పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్కు కౌంటర్ ఎటాకింగ్ గేమ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగా, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ కీలక పరుగులు జోడించి జట్టుకు కొండంత అండగా నిలిచారు. దీనికి బదులుగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక ముందు 372 పరుగుల క్లిష్టమైన లక్ష్యం నమోదైంది.

రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు జడేజా, మానవ్ సుతార్ తమ స్పిన్ మాయాజాలంతో లంక బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా మానవ్ సుతార్ 77.4వ ఓవర్‌లో కేశర నువంత (20)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక కథ ముగిసింది. అసాధారణ బౌలింగ్ నైపుణ్యంతో భారత్‌కు ఈ భారీ విజయాన్ని అందించిన జడేజా, సుతార్ జోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോഹൻ ഭാഗവതിന്റെ യു.എസ് സന്ദർശനത്തിന് മുന്നോടിയായി ആർ.എസ്.എസ്സിനെതിരെ ഉപരോധ ആവശ്യം; USCIRF ഇടപെടൽ

ന്യൂദൽഹി: ആർ.എസ്.എസ് മേധാവി മോഹൻ ഭാഗവത് മൂന്ന് രാജ്യങ്ങളിലേക്കുള്ള സന്ദർശനം ആരംഭിക്കാനിരിക്കെ,...

"அம்மா, உங்களையும் அப்பாவையும் ஒன்றாக பார்த்து 35 ஆண்டுகளுக்கும் மேலாகிவிட்டது.!"- ராகுல் உருக்கம்

இந்திய தேசிய காங்கிரஸின் மூத்த தலைவர் சோனியா காந்தியின் வாழ்க்கைப் பயணத்தை...

ಕರ್ನಾಟಕ ಸೇರಿ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ನ್ಯಾಯಯುತ ಅನುದಾನ ನೀಡಿ: ಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್ ಒತ್ತಾಯ

ಮಹಾಬಲಿಪುರಂ, ಆಗಸ್ಟ್, 20,2026 (www.justkannada.in): “ಕರ್ನಾಟಕ ಬಲಿಷ್ಠವಾದಾಗ, ದಕ್ಷಿಣ ಭಾರತ...