17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!

Date:

MLC Nagababu Gets Cabinet Rank: జనసేన ఎమ్మెల్సీ, సినీ నటుడు కొణిదెల నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఆయనకు క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పర్యావరణ, అటవీశాఖకు సంబంధించిన గ్రీన్‌ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్‌ కల్పించడంతో.. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయనను కీలక కమిటీకి చైర్మన్‌గా నియమిస్తూ కేబినెట్ హోదా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నాగబాబు నియామకం నేపథ్యంలో శాసనమండలిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాగబాబును పలకరించి కుశల ప్రశ్నలు అడిగారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యుల గురించి నాగబాబును అడిగి తెలుసుకున్నారు. ‘పిల్లలు బాగున్నారా?’ అంటూ త్రిమూర్తులు ప్రశ్నించగా.. నాగబాబు కూడా ఆయనతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అలాగే నాగబాబు ఆరోగ్యం గురించి కూడా తోట త్రిమూర్తులు అడిగారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు శాసనమండలిలో ఆప్యాయంగా పలకరించుకోవడం అక్కడ ఆసక్తికరంగా మారింది.

Mlc Nagababu Cabinet Rank

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വനിതാ ഉദ്യോഗസ്ഥയ്‌ക്കെതിരെ ഔദ്യോഗിക യോഗത്തില്‍ മോശം ഭാഷാപ്രയോഗം: ഐ.എ.എസുകാരനെതിരെ അന്വേഷണം

ശ്രീനഗര്‍: വനിതാ ഉദ്യോഗസ്ഥയ്ക്ക് നേരെ ഔദ്യോഗിക യോഗത്തില്‍ മോശം പദപ്രയോഗം നടത്തിയ...

CJP-யின் தேசியக் கொடி போராட்டம்; மீண்டும் கைது செய்யப்பட்ட அபிஜித் தீப்கே; என்ன நடந்தது?

இந்தியத் தேர்தல் ஆணையத்தின் தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் பதவி...

Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?

Off The Record: విజయనగరం టీడీపీ మేయర్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం...

ഒരാളെ തുറുങ്കിലടച്ചാല്‍ ആയിരക്കണക്കിന് അഭിജീതുമാരും നേഹമാരും സമരത്തിലുണ്ട്; പ്രകാശ് രാജ്

തിരുവനന്തപുരം: ഒരു അഭിഷേകിനെയും ഒരു നേഹയെയും അറസ്റ്റ് ചെയ്താല്‍ ആയിരക്കണക്കിന് അഭിജീതുമാരും...