6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్‌ఎంసీ చట్టానికి గుడ్‌బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..

Date:

GHMC: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పట్టణ పాలనలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు 70 ఏళ్ల నాటి జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో సరికొత్త అవసరాలకు అనుగుణంగా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ భవిష్యత్తు పట్టణ పాలన కోసం ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదా (డ్రాఫ్ట్)ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ అత్యంత కీలకమైన కొత్త బిల్లుపై భాగ్యనగర ప్రజలు, పట్టణ అభివృద్ధి నిపుణుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను, సలహాలను ఆహ్వానించింది. నగర భవిష్యత్తును మార్చబోయే ఈ చట్టంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో.. జూలై 24, 2026 లోగా ఆన్‌లైన్ ద్వారా కానీ లేదా మున్సిపల్ శాఖకు లిఖితపూర్వకంగా కానీ తమ సూచనలను పంపవచ్చని స్పష్టం చేసింది. 1955లో రూపొందించిన పాత జీహెచ్‌ఎంసీ చట్టంలోని చాలా నిబంధనలు ప్రస్తుత గ్లోబల్ సిటీ అవసరాలకు సరిపోవడం లేదని, కాలానుగుణత కోల్పోయిన అలాంటి పాత నిబంధనలన్నింటినీ ఈ కొత్త బిల్లు ద్వారా పూర్తిగా తొలగించనున్నారు.

ఆధునిక పట్టణ పాలనను అందించడం, సమగ్ర పౌర సేవలను వేగవంతం చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో (Net Zero) కార్బన్ ఉద్గారాల లక్ష్యాలను అందుకోవడం వంటి అంశాలకు ఈ కొత్త బిల్లులో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. నగరంలో వ్యాపార సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత పెంపొందించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా ఈ సరికొత్త చట్టాన్ని డిజైన్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా రూపొందించిన ఈ ముసాయిదా బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సూచనలు చేయాల్సిందిగా నగరంలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA), పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పిలుపునిచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗസയില്‍ രണ്ട് പതിറ്റാണ്ടോളം നീണ്ട ഭരണം അവസാനിപ്പിക്കുന്നതായി പ്രഖ്യാപിച്ച് ഹമാസ്

ഗസസിറ്റി: ഗസയില്‍ ഹമാസിന്റെ നേതൃത്വത്തില്‍ രണ്ട് പതിറ്റാണ്ടോളമായി ഭരണം നടത്തിയിരുന്ന ഗവണ്‍മെന്റ്...

நீதிமன்றத்தில் ஆஜராகாத அரசு வழக்கறிஞர்கள்; கலெக்டருக்கு அபராதம் விதித்த நீதிபதி; காரணம் என்ன?

கோவை மாவட்டம் கருமத்தம்பட்டியில் நடைபெற்ற ஒரு கொலை வழக்கு தொடர்பான விசாரணை,...

వన్డే ప్రపంచకప్‌ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!

Vaibhav Sooryavanshi: క్రికెట్‌ ప్రపంచంలో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్...

ಸಚಿವ ಯತೀಂದ್ರ ಖಾತೆ ಬದಲಿಸುವಂತೆ ಆಗ್ರಹ: ಸಿಎಂ ಡಿಕೆಶಿಗೆ ಪತ್ರ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,6,2026 (www.justkannada.in):  ನಗರಾಭಿವೃದ್ದಿ ಇಲಾಖೆ ಸಚಿವ ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ...