6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

EPFOలో కీలక మార్పులు.. పోర్టల్‌లో రెండు సేవలకు ముగింపు..

Date:

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఆన్‌లైన్ సేవల్లో కీలక మార్పులు చేసింది. ఇటీవల వారం రోజుల పాటు కొనసాగిన డేటాబేస్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అనంతరం EPFO పోర్టల్ మళ్లీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, కొన్ని సేవలను పూర్తిగా పోర్టల్ నుంచి తొలగించింది. ముఖ్యంగా UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)కు సంబంధించిన రెండు కీలక సేవలు ఇకపై EPFO వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండవు. EPFO తెలిపిన వివరాల ప్రకారం, అప్‌గ్రేడ్ తర్వాత క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని సేవల్లో స్వల్ప అంతరాయాలు ఉండొచ్చని కూడా సంస్థ పేర్కొంది.

పోర్టల్ నుంచి తొలగించిన రెండు సేవలు

EPFO పోర్టల్ నుంచి తొలగించిన సేవల్లో మొదటిది UAN యాక్టివేషన్, రెండోది కొత్త UAN జనరేషన్. ఇప్పటి వరకు సభ్యులు EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా ఈ సేవలను పొందగలిగేవారు. అయితే ఇకపై ఈ రెండు సేవలను కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల వేదిక అయిన UMANG యాప్ ద్వారా మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి

కొత్త విధానం ప్రకారం UAN యాక్టివేషన్ లేదా కొత్త UAN పొందాలంటే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ (Face Authentication) తప్పనిసరిగా పూర్తి చేయాలి. దీని ద్వారా సేవలను మరింత సురక్షితంగా, వేగంగా అందించడమే EPFO లక్ష్యంగా పేర్కొంది.

అప్‌డేట్ తర్వాత వచ్చిన ప్రధాన మార్పులు

* EPFO పోర్టల్ ద్వారా UAN యాక్టివేషన్ సౌకర్యాన్ని నిలిపివేశారు.. పోర్టల్‌లో కొత్త UAN రూపొందించే అవకాశం తొలగించారు.
* UAN యాక్టివేషన్, UAN జనరేషన్ సేవలను పూర్తిగా UMANG యాప్‌కు బదిలీ చేశారు.. ఈ రెండు సేవలకు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు.
* మర్చిపోయిన UANను తిరిగి పొందే విధానాన్ని మరింత సులభతరం చేశారు.. UMANG యాప్ ద్వారా UANను ఎలా యాక్టివేట్ చేయాలి?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్‌లో EPFO సేవలను ఎంచుకుని “UAN Service Through Face Authentication” విభాగంలో “UAN Activation” ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరిస్తే UAN యాక్టివేషన్ పూర్తవుతుంది.

కొత్త UANను ఎలా పొందాలి?

కొత్త UAN అవసరమైన సభ్యులు కూడా ఇకపై UMANG యాప్ ద్వారానే దరఖాస్తు చేయాలి. యాప్‌లో EPFO సేవలను ఎంచుకుని “UAN Allotment & Activation” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి, సూచించిన దశలను అనుసరిస్తే కొత్త UANను పొందవచ్చు. అయితే, EPFO చేపట్టిన ఈ మార్పులతో సభ్యులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యమని సంస్థ స్పష్టం చేసింది. కాబట్టి UANకు సంబంధించిన సేవలు అవసరమైన సభ్యులు ఇకపై EPFO పోర్టల్‌కు బదులుగా UMANG యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നാണമില്ലേ ആ സീറ്റില്‍ ഇരിക്കാന്‍; ഞാനല്ല ഗോവിന്ദനാണ് വര്‍ഗവഞ്ചകന്‍: ജി. സുധാകരന്‍

തിരുവനന്തപുരം: സി.പി.ഐ.എം ജനറല്‍ സെക്രട്ടറി എം.വി ഗോവിന്ദനെതിരെ രൂക്ഷ വിമര്‍ശനവുമായി മുന്‍...

`Last Bench' சர்ச்சை: “தன்னைக் கற்றறிந்த ஞானி போல காட்டிக் கொள்ள…" – நயினார் நாகேந்திரன்

விருதுநகர் மாவட்டம் சிவகாசி அருகே திருத்தங்கலில் உள்ள அரசுப் பெண்கள் மேல்நிலைப்...

AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు

AP Employee Transfers Ban: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక...

ಹೆಡ್ ಲೈಟ್ ಇಲ್ಲದೆ ಮೊಬೈಲ್ ಟಾರ್ಚ್ ಬೆಳಕಿನಲ್ಲಿ ಬಸ್ ಚಾಲನೆ:  ಡ್ರೈವರ್ ಸೇರಿ ಮೂವರು ಸಸ್ಪೆಂಡ್

ಕಲಬುರ್ಗಿ,ಜುಲೈ,6,2026 (www.justkannada.in):  ಗೃಹ ಸಚಿವರ ತವರು ಕಲ್ಬುರ್ಗಿಯಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಟಾರ್ಚ್...