15
May, 2026

A News 365Times Venture

15
Friday
May, 2026

A News 365Times Venture

Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్

Date:

Tilak Varma Gesture: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. పంజాబ్ కింగ్స్‌ తో గురువారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్.. మ్యాచ్ అనంతరం చేసిన ఓ ప్రత్యేక సెలబ్రేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ గెలిపించిన తర్వాత అతడు చేతులతో “45” సంకేతం చూపిస్తూ డగౌట్ వైపు చూసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ధరించే జెర్సీ నంబర్ 45 కావడంతో.. తిలక్ తన ఇన్నింగ్స్‌ను రోహిత్‌కు అంకితం చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. ఆ క్షణానికి రోహిత్ శర్మ స్పందన కూడా ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్ నేరుగా తిలక్ దగ్గరకు వెళ్లి హత్తుకుని అభినందించడం అభిమానులను ఆకట్టుకుంది.

201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. ఇక ఓపెనర్స్ అవుట్ అయ్యాక వచ్చిన తిలక్ వర్మ ధాటిగా ఆరంభం ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. మొదట షెర్ఫేన్ రదర్‌ ఫోర్డ్‌ తో కలిసి 42 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. అనంతరం విల్ జాక్స్‌ తో కలిసి అజేయంగా 56 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన తిలక్.. జట్టుకు మ్యాచ్‌లు ఫినిష్ చేయడం తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయడం నాకు చాలా ఇష్టం. వరల్డ్ కప్స్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ పిచ్ ఇలా స్లోగా ఉంటుందని ఊహించలేదని.. పంజాబ్ తొలి 15 ఓవర్లలో ఇబ్బంది పడిన తీరు చూసి మ్యాచ్‌ను డీప్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం అని తిలక్ అన్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചോദ്യപേപ്പര്‍ ചോര്‍ച്ച; നീറ്റ് പുനപരീക്ഷ ജൂണ്‍ 21ന്

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ ഏറ്റവും വലിയ മെഡിക്കല്‍ എന്‍ഡ്രന്‍സ് പരീക്ഷയായ നീറ്റ് പുനപരീക്ഷ...

புதுக்கோட்டை : 'இந்த டாஸ்மாக் கொடுமைக்கு முற்றுப்புள்ளி.!' – மக்கள் நிம்மதிப் பெருமூச்சு!

தமிழகம் முழுவதும் கல்வி நிலையங்கள் மற்றும் வழிபாட்டுத் தலங்களுக்கு அருகே உள்ள...

NEET UG ಮರು ಪರೀಕ್ಷೆಗೆ ದಿನಾಂಕ ನಿಗದಿ

ನವದೆಹಲಿ,ಮೇ,15,2026 (www.justkannada.in): ಪ್ರಶ್ನೆ ಪತ್ರಿಕೆ ಸೋರಿಕೆಯಿಂದಾಗಿ ರದ್ದುಗೊಂಡಿದ್ದ ನೀಟ್ ಯುಜಿ...

സാമൂഹിക പരിഷ്‌ക്കരണവുമായി ബന്ധപ്പെട്ട കാര്യങ്ങളില്‍ കോടതികള്‍ക്ക് ഭരണഘടാനാപരമായ ഉത്തരവാദിത്തം ഉപേക്ഷിക്കാന്‍ കഴിയില്ല; സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: സാമൂഹിക പരിഷ്‌ക്കരണവുമായി ബന്ധപ്പെട്ട വിഷയങ്ങളില്‍ തങ്ങളുടെ ഭരഘടനാപരമായ ഉത്തരവാദിത്തങ്ങളില്‍ നിന്ന്...