28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

స్లిమ్ బెజెల్స్‌, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!

Date:

Xiaomi X Pro QLED (2026): భారత్‌లో షియోమీ (Xiaomi) సంస్థ మరో భారీ స్క్రీన్ మోడల్‌ను తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 43-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్న Xiaomi X Pro QLED (2025) సిరీస్‌కు కొనసాగింపుగా.. ఇప్పుడు కొత్త 75-అంగుళాల మోడల్‌ ను కంపెనీ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం Xiaomi X Pro QLED (2026) 75-అంగుళాల టీవీ ఫిబ్రవరి 19న భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఏర్పాటు చేసింది. భారత్‌లో షియోమీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకరానున్నారు.

MLA Arava Sridhar Controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వ్యవహారం.. మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ..

రాబోయే 75-అంగుళాల మోడల్‌లో CineMagiQ, MaxMagiQ ఫీచర్లు ఉండనున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. ఇవి గత ఏడాది మోడళ్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టీవీ తక్కువ బెజెల్స్‌తో స్లీక్ డిజైన్‌లో రానుంది. రెండు వైపులా సౌండ్ విడుదల చేసే టూ-వే ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఇందులో ఉండనుంది. టీవీ స్టాండ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే వాల్ మౌంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశముంది. అయితే పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇదివరకువిడుదలైన Xiaomi X Pro QLED (2025) సిరీస్‌కు అప్డేటెడ్ మోడల్‌గా నిలవనుంది. 43-అంగుళాల మోడల్ ధర రూ. 31,999, 55-అంగుళాల మోడల్ రూ. 44,999, 65-అంగుళాల మోడల్ రూ. 64,999గా నిర్ణయించారు.

Off The Record: చుట్టూ ఉన్నవాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యేకు సమస్యలు పెరుగుతున్నాయా?

గత ఏడాది మోడళ్లలో 4K (3,840×2,160 పిక్సెల్స్) రిజల్యూషన్, 178-డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే షియోమీ సొంతంగా అభివృద్ధి చేసిన Vivid పిక్చర్ ఇంజిన్ 2, DLG (Dual Line Gate) టెక్నాలజీలను వినియోగించారు. 65 అంగుళాల ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో 34W స్పీకర్ యూనిట్ ఉండి,షియోమీ సౌండ్, డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual: X టెక్నాలజీలకు సపోర్ట్ ఇచ్చింది. ఇది క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్‌తో పాటు Mali-G52 MC1 GPU, 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. MagiQ ఫీచర్ ద్వారా సహజమైన రంగులు, మెరుగైన విజువల్ అనుభవాన్ని అందించడమే కాకుండా “ఫిలింమేకర్ మోడ్” కూడా అందించింది. రానున్న 75-అంగుళాల Xiaomi X Pro QLED (2026) 75-inch TV మోడల్‌లో ఇంకా ఎలాంటి అప్‌గ్రేడ్లు ఉంటాయో తెలియాల్సి ఉంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై ఫిబ్రవరి 19న స్పష్టత రానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!

OTR: కొడితే కొట్టాలిరా…. సిక్స్‌ కొట్టాలి అంటూ కొత్తగా సాంగులు సింగుతున్నారట...

ಕಾಮಗಾರಿ ಅಪೂರ್ಣ, ಬಳಕೆಗೆ ಬಾರದ ಸ್ಥಿತಿ:  “ಸೈನಿಕ” ಉದ್ಯಾನವನಕ್ಕೆ ಗ್ರಹಣವೇ?

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in): ನಗರದ ದಟ್ಟಗಳ್ಳಿ 3ನೇ ಹಂತದಲ್ಲಿ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದೇವಸ್ಥಾನದ...

പ്രതിപക്ഷ ഉപനേതാവ് തര്‍ക്കം തുടരുന്നു; പ്രസ്താവനകളില്‍ നേതാക്കള്‍ മിതത്വം പാലിക്കണമെന്ന് ടി.പി രാമകൃഷ്ണന്‍

തിരുവനന്തപുരം: പ്രതിപക്ഷ ഉപനേതാവ് തര്‍ക്കത്തിലെ പ്രസ്താവനകളില്‍ നേതാക്കള്‍ മിതത്വം പാലിക്കണമെന്ന് എല്‍.ഡി.എഫ്...

கருப்புச் சட்டையில் திமுக கவுன்சிலர்கள்; முதல்வர் விஜய்க்கு கடிதம் எழுதிய மேயர் பிரியா; விவரம் என்ன?

சென்னை மாநகராட்சியின் மாதாந்திரக் கூட்டம் இன்று ரிப்பன் மாளிகையில் நடந்து வருகிறது....