16
August, 2026

A News 365Times Venture

16
Sunday
August, 2026

A News 365Times Venture

Minister Lokseh: జిల్లా ఇంఛార్జి మంత్రులతో నారా లోకేష్ సమావేశం..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు. సాధారణ ఎన్నికలను తీసుకున్నట్టే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా సీరియస్‌గా తీసుకుని పని చేయాలన్నారు లోకేష్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని మంత్రులకు సూచించారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నామో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని పేర్కొన్నారు. కేవలం ఏడు నెలల్లోనే తీసుకొచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని ఇంఛార్జి మంత్రులకు నారా లోకేష్ తెలిపారు. ఏడేళ్ల తరువాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు వివరించాలని మంత్రి కోరారు.

Read Also: Kejriwal: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

వచ్చే నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

கர்நாடக வனத்துறை தூப்பாக்கிச் சூடு: "காரணமானவர்கள் தண்டிக்கப்பட வேண்டும்!" – மு.க. ஸ்டாலின்

கர்நாடக மாநிலம், சாமராஜநகர் மாவட்டத்தில் உள்ள ஹனூர் அருகில், காவிரி வனவிலங்கு...

Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మోండేలో ఒక సాధారణ డ్రైనేజీ పైప్‌లైన్ తవ్వకం పనుల్లో నిమగ్నమైన...

പി.എം ശ്രീ നിലപാടിൽ മാറ്റമില്ല; അറബിക്കടലിനപ്പുറം അഴുക്കുചാലുണ്ടെങ്കിൽ അവിടെ എറിയണം: കെ.എം. ഷാജി

കണ്ണൂർ: പി.എം ശ്രീ പദ്ധതിക്കെതിരായ തന്റെ രാഷ്ട്രീയ നിലപാടിൽ മാറ്റമില്ലെന്ന് കെ.എം....