11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..

Date:

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మోండేలో ఒక సాధారణ డ్రైనేజీ పైప్‌లైన్ తవ్వకం పనుల్లో నిమగ్నమైన నిర్మాణ కార్మికులకు ఒక అరుదైన నిధి దొరికింది. దాదాపు 9 మిలియన్ యూరోలు (సుమారు రూ. 98 కోట్లు) విలువైన బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేల నిల్వ ఈ తవ్వకాలలో బయటపడింది. వేసవి సెలవుల్లో పనికి వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబ్ ఈ నిధిని మొదటగా గుర్తించాడు. పైపులు తొలగిస్తుండగా ఏదో మెరుస్తూ కనిపించిందని, మొదట అవి సాధారణ నాణేలు అనుకున్నామని, కానీ పరిశీలిస్తే బంగారు బిస్కెట్లు, పురాతన నాణేలతో ఉన్న పెద్ద సంచిగా తేలిందని అతను తెలిపాడు.

ఈ బంగారు నిధి 19వ శతాబ్దం చివరలో నిర్మించిన ఒక పురాతన భవనం క్రింద ఉన్న ఇటుకల గోడ మధ్య దాచి ఉంచబడి ఉంది. ఈ భవనం గతంలో ప్రముఖ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చేకి చెందిన ఒక బ్రూవరీగా ఉండేది. ఇక్కడ 1899 నుంచి 1970 వరకు పానీయాల తయారీ జరిగింది. ప్రస్తుతం ఈ చారిత్రక భవనాన్ని ‘CAW ఓస్ట్-విలాండెరెన్’ అనే సామాజిక సంక్షేమ సంస్థ తమ కొత్త ఆఫీసులు, నివాసాల కోసం పునరుద్ధరిస్తోంది. పనులు జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఈ నిధి వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, లభించిన బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ బంగారం వెనుక ఉన్న చట్టపరమైన హక్కుదారులను గుర్తించడానికి తూర్పు ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఈ బంగారం ఏదైనా నేరంతో సంబంధం ఉన్నదా లేదా దొంగిలించబడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

బెల్జియం చట్టాల ప్రకారం.. దొరికిన నిధిపై హక్కు దావా వేయడానికి అసలైన యజమానులకు ఐదేళ్ల సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ నిధిపై నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, సంక్షేమ సంస్థ, వాన్ అస్చే వారసులు హక్కులు కోరే అవకాశం ఉంది. భారీ మొత్తంలో లభించినందున చట్టపరంగా అధికారులకు అప్పగించామని, భవిష్యత్తులో తమకు ఏదైనా రివార్డు రూపంలో ప్రతిఫలం దక్కుతుందేమో వేచి చూడాలని కార్మికుడు కోబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എല്ലാം നിയമാനുസൃതമായാണ് നടക്കുന്നത് : പ്രതിഷേധത്തിന്മേലുള്ള യു.എന്‍ പ്രസ്താവനയില്‍ ഇന്ത്യ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ നടക്കുന്ന സമരത്തില്‍ പ്രതിഷേധക്കാര്‍,...

"அரசுகள் மாறினாலும் தமிழ்நாடு மக்களுக்குச் சேவை புரிவதில் என் மன உறுதி தொடர்கிறது" – பிரதமர் மோடி

தமிழகத்தில் பல்வேறு திட்டங்களைத் தொடங்கி வைக்க, இன்று பிரதமர் நரேந்திர மோடி...

Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!

Lancet Report: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) దుర్వినియోగం, అణుయుద్ధం, జీవ ఆయుధాల వినియోగంతో...

പോരാട്ടം ഇപ്പോള്‍ തുടങ്ങിയിട്ടേയുള്ളൂ; ഗ്യാനേഷിനെതിരെ മാത്രമല്ല മോദിക്കും അമിത്ഷായ്ക്കും എതിരെ കൂടെയാണ് പ്രതിഷേധം: സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയില്‍ മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരായ പ്രതിഷേധം തുടരുമെന്ന്...