14
February, 2025

A News 365Times Venture

14
Friday
February, 2025

A News 365Times Venture

Royal Enfield Hunter 350 : ఈ బైక్ పై భారీగా మనసు పడ్డ జనం.. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయో తెలిస్తే షాకే

Date:

Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్ఫీల్డ్ మూతపడుతుంది అనుకున్న కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో నంబర్ 1గా ఎదిగింది. ఈ బైక్ ల కోసం జనాలు కొన్ని నెలల పాటైనా వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతలా బైక్ పై క్రేజ్ పెంచుకున్నారు. పేరులోని రాయల్ వాళ్ల లైఫ్ లో బండితో రావాలని కోరుకుంటున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బ్రిటిష్ బ్రాండ్ మోటార్ సైకిళ్లకు మార్కెట్లో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 అమ్మకాలలో కొత్త మైలురాయిని సాధించింది.

ఈ రాయల్ బైక్ ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. రాయల్ హంటర్ 350 ఆగస్టు 2022లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి 2023 నాటికి ఈ మోటార్ సైకిల్ లక్ష యూనిట్లు అమ్ముడు పోయాయి. తదుపరి ఐదు నెలల్లో మరో లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ భారీ అమ్మకాల కారణంగా బ్రాండ్ అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిల్‌గా మారిపోయింది.

Read Also:Adinarayana Reddy: వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డికి అభినందనలు!

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బ్రాండ్ నుండి అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో ఒకటి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.5 లక్షల నుండి ప్రారంభమై రూ. 1.75 లక్షల వరకు ఉంటుంది. భారతదేశంతో పాటు బ్రిటిష్ ఆటోమేకర్ల ఈ బైక్ ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాల్లో అమ్ముడవుతుంది. ఇది కాకుండా మెక్సికో, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లలో కూడా ఈ బైక్‌కు డిమాండ్ ఉంది.

హంటర్ 350 పవర్, మైలేజ్
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లో 349 సిసి, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో రాబోతుంది. ఇది ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా కలిగి ఉంది. హంటర్ 350 లోని ఈ ఇంజన్ 6,100 rpm వద్ద 20.2 bhp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లోని ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటర్‌కు 36.2 కి.మీ. ఈ బైక్ 13 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 468 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

Read Also:Swift VS Dzire : మారుతి స్విఫ్ట్ లేదా డిజైర్.. ఏది బెస్ట్.. మంచి మైలేజీ ఇచ్చే కారు ఇదే ?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి సవాల్!

మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶ: ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡಿದ ಎಂ ಬಿ ಪಾಟೀಲ

ಬೆಂಗಳೂರು, Feb.12,2025: ಜಾಗತಿಕ ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಬುಧವಾರ ದಿನವಿಡೀ ಬೃಹತ್...

മലയോര ഹൈവേ; 250 കി.മീ പണി പൂര്‍ത്തിയായി, ഒരു വര്‍ഷത്തിനകം 200 കി.മീ കൂടി; ആദ്യ റീച്ചിന്റെ ഉദ്ഘാടനം നാളെ

തിരുവനന്തപുരം: കാസര്‍ഗോഡ് ജില്ലയിലെ നന്ദാരപ്പടവ് മുതല്‍ തിരുവനന്തപുരം ജില്ലയിലെ പാറശ്ശാലവരെ നീളുന്ന...

`மனைவி கணவரை தவிர்த்து வேறொருவர் மீது காதலும், நெருக்கமும் கொண்டிருப்பது தகாத உறவாகாது'- MP ஹைகோர்ட்

மத்தியப் பிரதேசத்தைச் சேர்ந்த ஒருவர் தன்னுடைய மனைவிக்கு வேறு ஒருவருடன் தொடர்பு...