Tilak Varma Gesture: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. పంజాబ్ కింగ్స్ తో గురువారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్.. మ్యాచ్ అనంతరం చేసిన ఓ ప్రత్యేక సెలబ్రేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ గెలిపించిన తర్వాత అతడు చేతులతో “45” సంకేతం చూపిస్తూ డగౌట్ వైపు చూసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ధరించే జెర్సీ నంబర్ 45 కావడంతో.. తిలక్ తన ఇన్నింగ్స్‌ను రోహిత్‌కు అంకితం చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. ఆ క్షణానికి రోహిత్ శర్మ స్పందన కూడా ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్ నేరుగా తిలక్ దగ్గరకు వెళ్లి హత్తుకుని అభినందించడం అభిమానులను ఆకట్టుకుంది.
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. ఇక ఓపెనర్స్ అవుట్ అయ్యాక వచ్చిన తిలక్ వర్మ ధాటిగా ఆరంభం ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. మొదట షెర్ఫేన్ రదర్ ఫోర్డ్ తో కలిసి 42 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. అనంతరం విల్ జాక్స్ తో కలిసి అజేయంగా 56 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన తిలక్.. జట్టుకు మ్యాచ్‌లు ఫినిష్ చేయడం తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయడం నాకు చాలా ఇష్టం. వరల్డ్ కప్స్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ పిచ్ ఇలా స్లోగా ఉంటుందని ఊహించలేదని.. పంజాబ్ తొలి 15 ఓవర్లలో ఇబ్బంది పడిన తీరు చూసి మ్యాచ్‌ను డీప్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం అని తిలక్ అన్నారు.
Tilak showing “45” and saying “Rohit bhai, Rohit bhai” after finishing the match
pic.twitter.com/FGs6DMhHLF
—
(@Arrestpandya) May 14, 2026
TILAK VARMA HANDED PUNJAB KINGS THEIR 5TH CONSECUTIVE DEFEAT.
– The celebration from MI camp says it all.
pic.twitter.com/SHWDMxYI8v
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2026




(@Arrestpandya)
TILAK VARMA HANDED PUNJAB KINGS THEIR 5TH CONSECUTIVE DEFEAT.


