8
May, 2026

A News 365Times Venture

8
Friday
May, 2026

A News 365Times Venture

Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!

Date:

AP and Telangana Weather Update Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న పలు వాతావరణ మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళ వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి.

ఇదే సమయంలో ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో వాతావరణంలో అస్థిరత పెరిగింది. ఈ ప్రభావాలకు తోడు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా అధికారులు వేస్తున్నారు.

రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకుంటే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రైతులు కూడా పంటల సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ശത്രുക്കള്‍ക്കെതിരെ ഇറാന്‍ ഉടന്‍ മഹത്തായ വിജയം ആഘോഷിക്കും; വൈസ് പ്രസിഡന്റ്

ടെഹ്‌റാന്‍: രാജ്യം ഉടന്‍ തന്നെ ശത്രുക്കള്‍ക്കെതിരായ മഹത്തായ വിജയം ആഘോഷിക്കുമെന്ന് ഇറാന്റെ...

TVK: “2 பயந்த கட்சிகள் தங்கள் அதிகாரத்தைக் காக்க…" – எம்.பி மாணிக்கம் தாகூர் கடும் விமர்சனம்

தமிழ்நாடு சட்டமன்றத் தேர்தல் முடிந்ததிலிருந்து, தொடர்ந்து சலசலப்புடன் நகர்ந்துகொண்டிருக்கின்றன நாள்கள். இந்தத்...

ಪಡಿತರ ಅಕ್ಕಿ ಅಕ್ರಮ ಸಾಗಣೆದಾರರಿದ 3 ಲಕ್ಷ ವಸೂಲಿ ಆರೋಪ: SP ಗನ್ ಮ್ಯಾನ್ ಬಂಧನ

ಬಳ್ಳಾರಿ,ಮೇ,8,2026 (www.justkannada.in): ಪಡಿತರ ಅಕ್ಕಿ ಅಕ್ರಮ ಸಾಗಣೆದಾರರಿದ 3 ಲಕ್ಷ...

നെറ്റ് എക്സാമിന് സംവരണ ‘കട്ട്’ ; അപേക്ഷിക്കാനാകാതെ അപേക്ഷാർത്ഥികൾ വലയുന്നു

യൂണിവേഴ്സിറ്റി ഗ്രാന്റ് കമ്മീഷൻ നടത്തുന്ന നെറ്റ് പരീക്ഷക്ക് അപേക്ഷിക്കാനാകാതെ അപേക്ഷാർത്ഥികൾ വലയുന്നു....