25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్‌ షఫాలీ జరివాలా మృతి!

Date:

నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్‌ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్‌ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు.

2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. ఆ సాంగ్‌తో కుర్రకారు మదిని దోచేశారు. దాంతో ఆమెను కాంటా లాగా గర్ల్‌గా పిలవడం ప్రారంభించారు. సాంగ్‌ అనంతరం సల్మాన్‌ ఖాన్‌ ‘ముజ్సే షాదీ కరోగా’ చిత్రంలో షఫాలీ ఓ పాత్ర చేశారు. ఆపై పలు టీవీ రియాలిటీ షోలు చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిందీ బిగ్‌బాస్‌ 13లో పాల్గొన్నారు. రియాలిటీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 5లో పాల్గొన్నారు.

షఫాలీ జరివాలా 1982 డిసెంబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు సతీష్ జరీవాలా, తల్లి పేరు సునీతా జరీవాలా. 2014లో షెఫాలీ టీవీ సీరియల్ నటుడు ప్రాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం షఫాలీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చివరి పోస్ట్ చేశారు. అందులో ఆమె తన ఫొటోస్ పోస్ట్ చేసి.. ‘బ్లింగ్ ఇట్ ఆన్ బేబీ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. షఫాలీ మృతి పట్ల ప్రముఖ గాయని మికా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ದಸರಾ ಸಂಭ್ರಮ: ಟ್ರಾಫಿಕ್ ನಿರ್ವಹಣೆಗೆ ಡಿಜಿಟಲ್ ತಂತ್ರಜ್ಞಾನ, ಸುಗಮ ಸಂಚಾರಕ್ಕೆ ಹೊಸ App.

  ಮೈಸೂರು, ಸೆ.25, 2026: ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ದಿನಗಣನೆ...

ഗ്യാനേഷ് കുമാറിന് കുറഞ്ഞത് പത്മഭൂഷണെങ്കിലും നല്‍കണമെന്ന് ബി.ജെ.പി നേതാവ്

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ കുറഞ്ഞത് ഒരു...

"நிர்வாண வீடியோவை பரப்புகிற கேவலமான ஆள் நானில்லை" – பெண் குற்றச்சாட்டு குறித்து கருப்பு முருகானந்தம்

தமிழக பாரதிய ஜனதா கட்சியின் மாநில பொதுச்செயலாளர் கருப்பு முருகானந்தம் மீது,...

Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..

తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణాలను సురక్షితంగా...