15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్‌పోర్టులో హై టెన్షన్!

Date:

చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి 171 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అమెరికా ,కేరళకు చెంది‌న ఇద్దరు ప్రయాణికుల మద్య గోడవ జరిగింది. ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు. తమ దగ్గర బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ హెచ్చరించారు. ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

పైలెట్లు చెన్నైలో భద్రత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనికీలు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు వరకు తనిఖీలు చేసి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. పరస్పరం కొట్టుకుని ప్రయాణికులను బాంబు అంటూ భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘കുറ്റവാളിമുക്ത പാർലമെന്റ് സമ്മാനമായി വേണം’; പ്രധാനമന്ത്രിയോട് ആവശ്യപ്പെട്ട് സോനം വാങ്ചുക്

ന്യൂഡൽഹി: ഈ സ്വാതന്ത്ര്യദിനത്തിൽ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയോട് ‘കുറ്റവാളിമുക്ത പാർലമെന്റ്’ സമ്മാനമായി...

பள்ளி மாணவர் கொலை: "அரசு கண்டும் காணாமல் வாயை மூடிக் கொண்டு இருப்பது வெட்கக்கேடு" – உதயநிதி கண்டனம்

சென்னை திருவொற்றியூரில் போதைப்பொருள் புழக்கத்தைத் தட்டிக்கேட்டதால், அரசுப் பள்ளியில் +2 படித்து...

ട്രംപ്-മോദി സൗഹൃദം ഇന്ത്യ യു.എസ് ബന്ധം ശക്തമാക്കി; സ്വാതന്ത്ര്യ ദിനത്തിൽ ആശംസകൾ നേർന്ന് യു.എസ് സ്റ്റേറ്റ് സെക്രട്ടറി

വാഷിംഗ്ടൺ: ഇന്ത്യയുടെ 80-ാം സ്വാതന്ത്ര്യദിനത്തിൽ രാജ്യത്തെ ജനങ്ങൾക്ക് ആശംസകൾ നേർന്ന് യു.എസ്...