27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?

Date:

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్ఛార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్ళారు. దాంతో… ఆమె స్థానంలో చాలా సీనియర్‌నుగాని, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నాయకుల్ని గానీ ఇన్ఛార్జ్‌గా పంపిస్తారంటూ పార్టీ వర్గాల్లో గట్టి చర్చలే నడిచాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, క్రమశిక్షణ కట్టు తప్పుతుండటం లాంటి పరిణామాలతో ఏఐసీసీ సీనియర్స్‌కే ప్రాధాన్యం ఇస్తుందని భావించారు అంతా. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పుడప్పుడు నోరు జారడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే… రేపు ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో, ఆసంతృప్తులు బయటపడి ఏ టర్న్‌ తీసుకుంటాయోనన్న ఆందోళన సైతం హస్తం వర్గాల్లో ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని… ఇన్ఛార్జ్‌గా సీనియర్ నేతను పంపుతారన్న ప్రచారం జరిగింది. కానీ… అలాంటిదేం లేకుండా… కర్ణాటకుకు చెందిన బి ఎం సందీప్‌ను నియమించారు. దాంతో… ఇది దేనికి సంకేతం…? తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి కాన్ఫిడెన్స్ ఎక్కవా? అన్న చర్చలు మొదలయ్యాయి.

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు… ఇప్పుడు ఇక్కడ కొట్టుకోవడం లేదు గానీ… హస్తిన వేదికగా రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఈ పరిస్థితిలో నలుగురితో మాట్లాడి.. వ్యవహారాలు సాఫీగా సాగేలా చూస్తే సరిపోతుందని ఫిక్స్ అయ్యారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట కొందరికి. ఇక్కడ సీనియర్ నేతలున్నా… అందర్నీ కలుపుకుని వెళ్ళడానికి ఒక ఇన్ఛార్జ్‌ కావాలి కాబట్టి సందీప్‌ని పెట్టారు తప్ప అంతకు మించిన ప్రాధాన్యం ఏం ఉండకపోవచ్చన్నది కొందరి వాదన. పార్టీ నిర్మాణం గురించి తెలిసిన వ్యక్తి అవ్వడంతోనే సందీప్‌ను ఇన్చార్జ్‌గా నియమించారని చెప్పుకుంటున్నారు. అలాగే… ఈ నియామకం ద్వారా… స్టేట్‌ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సంకేతాలందుతున్నాయంటున్నారు కొందరు. తెలంగాణ నాయకత్వం విషయంలో అధిష్టానం కాన్ఫిడెంట్‌గా ఉందా..! అంటే… పరిస్థితుల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తోందంటున్నారు. సీనియర్ నేతను ఇన్ఛార్జ్‌గా పెట్టి మరో పవర్ సెంటర్‌ని తయారు చేయడం ఎందుకన్న ఆలోచనలో ఏఐసీసీ పెద్దలు ఉండి ఉండవచ్చంటున్నారు. రాష్ట్రంలో నమ్మకమైన నాయకత్వం ఉండటం వల్ల కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటున్నారు. మొత్తానికి ఈ నియామకం ద్వారా… రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అర్ధమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

`குழந்தை பிறந்தால் தந்தைக்கும் 15 நாள்கள் விடுப்பு' – தமிழ்நாடு அரசு அறிவிப்பு – முழு விவரம்!

தமிழ்நாடு அரசில் பணிபுரியும் திருமணமான ஆண் ஊழியர்களுக்கு, குழந்தை பிறக்கும் காலகட்டத்தில்...

രാജ്യം ഭയപ്പെട്ടത് സംഭവിക്കാൻ പോകുന്നു; മണ്ഡല പുനർനിർണയ ബിൽ പാസാക്കുന്നതിനെതിരെ ജോൺ ബ്രിട്ടാസ്

തിരുവനന്തപുരം: വനിതാ സംവരണത്തിന്റെ പേരിൽ ഇന്ത്യയുടെ തിരഞ്ഞെടുപ്പ് ഭൂപടം അട്ടിമറിക്കാനുള്ള മണ്ഡല...

“தவெக ஆட்சியைக் கலைக்க வேண்டும்; ஆளுநர் அர்லேகர் சொன்ன பதில்..!" – நயினார் நாகேந்திரன்

மதுரை மாவட்டம், திருப்பரங்குன்றம் மலை மீதுள்ள தூணில் ஒருமுறை தீபம் ஏற்ற...

Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్

Off The Record: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సాధించిన...