27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!

Date:

మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి, పట్టణాభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక ప్రాజెక్టుల తాజా స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, పనుల వేగవంతంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనవరి 2027లో మూసీ పునరుజ్జీవం ఫేజ్–1 పనులను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మూసీ ఫేజ్–1 టెండర్లు.. జోన్ల విభజన

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్–1 పనుల వివరాలను అధికారులు సీఎంకు సమర్పించారు. ఫేజ్–1లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్–1 ఏగా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్–1 బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్–1 టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వివరించారు.

మిరాలం ట్యాంక్ అభివృద్ధి.. పూడిక తొలగింపునకు ఆదేశం

మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ పనులను జనవరి 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రేడియల్ రోడ్లు, గండిపేట గోశాల పనులపై సూచనలు

రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సీఎం సూచించారు. అలాగే గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతిని కూడా అధికారులు సమీక్షలో వివరించగా, మార్చి 2027 నాటికి పనులు పూర్తయ్యేలా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈൽ ജയിലുകളിൽ ഫലസ്തീൻ തടവുകാർ പട്ടിണിയും അവഗണനയും നേരിടുന്നു; ഫലസ്തീൻ സംഘടന

ഗസ: ഇസ്രഈൽ ജയിലുകളിൽ ഫലസ്തീൻ തടവുകാർ പട്ടിണിയും അവഗണനയും നേരിടുന്നെന്ന് റിപ്പോർട്ട്....

நாடாளுமன்ற சிறப்புக் கூட்டத்தொடரைக் கூட்டும் மத்திய அரசு – கவனம் பெறுவது எதனால்?!

நாடாளுமன்றத்தின் சிறப்புக் கூட்டத்தொடர் வரும் 30ம் தேதி முதல் டிசம்பர் 3ம்...

VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

VijayaSai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండుగ తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు...

സ്ത്രീകൾക്കെതിരായ അതിക്രമങ്ങൾ അവസാനിപ്പിക്കുന്നതിനുള്ള അന്താരാഷ്ട്ര ദിനത്തോടനുബന്ധിച്ച് ലോകമെമ്പാടും പ്രതിഷേധ റാലികൾ

ന്യൂയോർക്ക്: സ്ത്രീകൾക്കെതിരായ അതിക്രമങ്ങൾ അവസാനിപ്പിക്കുന്നതിനുള്ള അന്താരാഷ്ട്ര ദിനത്തോടനുബന്ധിച്ച് ലോകമെമ്പാടും സ്ത്രീകൾ പ്രതിഷേധ...