21
November, 2026

A News 365Times Venture

21
Saturday
November, 2026

A News 365Times Venture

Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్‌డౌన్!

Date:

Bangladesh: బంగ్లాదేశ్‌లో విధ్వంసం జరుగుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, స్వదేశంలో అడుగుపెట్టకముందే అక్కడి తారిఖ్ రెహ్మాన్ బీఎన్పీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. డిసెంబర్‌లో తాను బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు షేక్ హసీనా ప్రకటించింది. దీంతో ఆమె పార్టీ అవామీ లీగ్ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. మహ్మద్ యూనస్ తాత్కాలిక అధ్యక్షుడి ఉన్న సమయంలో అవామీ లీగ్‌ను నిషేధించాడు. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు బంగ్లాదేశ్‌లో విరుచుకుపడుతున్నారు.

బంగ్లాలో లాక్‌డౌన్..

షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తారని ప్రకటించడంతో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అవామీ లీగ్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో నవంబర్ 19న బంగ్లాదేశ్‌లో చాలా ప్రాంతాలు మూతపడ్డాయి. బుధవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో హింస, బాంబు పేలుళ్లు, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింస వెనక అవామీ లీగ్ ఉందని బంగ్లా ప్రభుత్వం ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్‌లో హింసను అదుపు చేసేందుకు బీఎన్‌పీ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో సుమారు 3,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఢాకా, చిట్టగాంగ్, నారాయణ్‌గంజ్, గాజీపూర్, గోపాల్‌గంజ్, మయమన్సింగ్, ఫరీద్‌పూర్ జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కు చెందిన 96 ప్లాటూన్లను రంగంలోకి దించారు.

ఢాకాలో బాంబు పేలుళ్లు..

బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో దాడులు, పోలీస్ స్టేషన్లకు నిప్పుపెట్టడం, పెట్రోల్ బాంబుల పేలుళ్లు జరిగాయి. మరోవైపు, అవామీ లీగ్ దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు షేక్ హసీనాకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నారు. పశ్చిమ నరైల్‌లో బుధవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనల్లో బీఎన్‌పీకి చెందిన ఇద్దరు స్థానిక నాయకులు మరణించారు. గత రెండు రోజుల్లో నైరుతి ఫరీద్‌పూర్, పిరోజ్‌పూర్ ప్రాంతాల్లోనూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఢాకాలోని అగర్‌గావ్ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు మెట్రో రైలు స్టేషన్ కింద నాటు బాంబును పేల్చారు. మరోవైపు, అధికార బీఎన్పీ కార్యకర్తలు ఢాకాలోని అవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు నాయకుల ఇళ్లపై దాడి చేసి నిప్పుపెట్టారు. చిట్టగాంగ్‌లో మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని కాల్చివేశారు.

అవామీ లీగ్‌ను అడ్డుకోవాలని ప్రధాని పిలుపు..

షేక్ హసీనా డిసెంబర్‌లో బంగ్లాదేశ్ వెళ్తున్న నేపథ్యంలో దేశం అంతా అట్టడుకుతోంది. అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి రావడాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య శక్తుల్నీ ఏకం కావాలని బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మన్ పిలుపునిచ్చారు. అవామీ లీగ్ ఉగ్రవాద సంస్థగా, ఓడిపోయి అధికారం కోల్పోయిన ఫాసిస్ట్ శక్తిగా ఆయన అభివర్ణించారు. మంగళవారం పార్లమెంట్‌లో తారిఖ్ రెహ్మాన్ ప్రసంగిస్తూ.. 2024లో నిరంకుశ శక్తులను దేశం నుంచి తరిమికొట్టినప్పుడు ఉన్న స్ఫూర్తితో మరోసారి ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఆ శక్తులను నిర్ణయాత్మకంగా ఓడించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബ്രെക്‌സിറ്റിന് ശേഷമുള്ള ബന്ധം പുനക്രമീകരിക്കല്‍; പുതിയ കരാറില്‍ ഇ.യു-യു.കെ ധാരണ

ബ്രസല്‍സ്: ബ്രെക്‌സിറ്റ് വോട്ടെടുപ്പിന് ശേഷമുള്ള പരസ്പര ബന്ധം പുനക്രമീകരിക്കുന്നതിന്റെ ഭാഗമായി യുണൈറ്റഡ്...

"குறுவை போச்சு; சம்பாவும் கருகுது; விவசாயிகளுக்கு Silent Mode-இல் உள்ள CM-இன் பதில் என்ன?"- ஸ்டாலின்

காவிரி நதிநீர் பங்கீடு தொடர்பாகத் தமிழக அரசு தாக்கல் செய்த மூன்று...

Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ

తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ...

സിറാജിനെ ടീമില്‍ നിന്ന് ഒഴിവാക്കിയത് വിവേചനമോ? രാഷ്ട്രീയ വിവാദങ്ങളില്‍ പ്രതികരിച്ച് കപില്‍ദേവ്

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യന്‍ ടെസ്റ്റ് ടീമില്‍ നിന്ന് ഫാസ്റ്റ് ബൗളര്‍ മുഹമ്മദ് സിറാജിനെ...