18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!

Date:

Congress: అస్సాంకు చెందిన కాంగ్రెస్ మాజీ మిత్రపక్షం రైజోర్ దళ్ అధినేత అఖిల్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ చీల్చిందని, దీని ద్వారా బీజేపీకి ఆ ఉద్యమాన్ని నియంత్రించే అవకాశం కల్పించిందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు, ప్రజా ఉద్యమాలనే కాంగ్రెస్ తన ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తోందని రాహుల్ గాంధీకి అఖిల్ గొగోయ్ ఘాటు లేఖ రాశారు. కాంగ్రెస్ రైజోర్ దళ్‌తో సంబంధాలు తెంచుకున్న 2 నెలల తర్వాత ఆయన ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

CJP ఉద్యమాన్ని బలహీనం చేసింది కాంగ్రెసే..

రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేపట్టిన నిరసనలకు సమాంతరంగా కాంగ్రెస్ కూడా వేరే ఆందోళనలు నిర్వహించడం వల్ల ఉద్యమంలో ఐక్యత దెబ్బతిందని చెప్పారు. దీంతో అధికారంలో ఉన్న పాలకులు ఈ ఉద్యమాన్ని నియంత్రించేందుకు అవకాశం కలిగిందని అన్నారు. నిర్ణయాత్మక పోరాటానికి దేశానికి లభించిన అత్యుత్తమ అవకాశాన్ని వృథా చేసిందని తన లేఖలో అఖిల్ గొగోయ్ దుయ్యబట్టారు.

అఖిల్ గొగోయ్ లేఖలో రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, అఖిల భారత విద్యార్థి సంఘం (AISA) అధ్యక్షురాలు నేహా బోరా, వామపక్ష నాయకులపైనా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా వీరంతా సమాంతర ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించారని, తద్వారా CJP ఉద్యమాన్ని బలహీనపరిచారని ఆయన విమర్శించారు.

గత సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ రైజోర్ దళ్‌తో పొత్తును వదులుకుంది. కూటమి నైతికతను ఉల్లంఘించడం, కూటమి ఐక్యతను దెబ్బతీయడం వంటి కారణాలను చూపుతూ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తులో భాగంగా 13 సీట్లు కోరిన రైజోయ్ దళ్‌కు కేవలం 4 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడిందని అఖిల్ గొగోయ్ ఆరోపించారు. అసోం కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్‌పై అఖిల్ విమర్శలు చేశారు. ఆయన అహంకారపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. కూటమి భాగస్వాములతో సంప్రదింపులు జరపకుండానే కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ఏకపక్షంగా సిద్ధం చేసిందని పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

“தவெக-வின் 60 – 70 எம்.எல்.ஏ-க்கள் அதிருப்தியில் இருக்கிறார்கள்" – திமுக ரகுபதி சொல்லும் கணக்கு!

தவெக-வின் 60 - 70 எம்.எல்.ஏ-க்கள் அதிருப்தியில் இருப்பதாக திமுக முன்னாள்...

മുഖ്യമന്ത്രിക്കെതിരെ മന്ത്രിമാർ; ക്യാബിനറ്റിൽ തർക്കം

തിരുവനന്തപുരം: മന്ത്രിസഭാ യോഗത്തിനുപിന്നാലെ മുഖ്യമന്ത്രി വി.ഡി.സതീശനെതിരെ മറ്റു മന്ത്രിമാർ.  മുഖ്യമന്ത്രി തീരുമാനമെടുക്കുന്നത്...

Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం

కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా...