18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం

Date:

కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవం ‘కోటి దీపోత్సవం-2026’ నాలుగో రోజు వేడుకలు మంగళవారం (నవంబర్ 17) నాడు అత్యంత వైభవంగా ముగిశాయి. కార్తీక మంగళవారం, గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన నేటి కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివ నామస్మరణతో మార్మోగాయి. కైలాసాన్ని తలపించే సభావేదికపై సాగిన విశేష పూజలు, అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, కల్యాణోత్సవం, వాహన సేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.

అమ్మవార్లకు కోటి కుంకుమార్చన.. మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం

నాలుగో రోజు వేడుకల్లో భాగంగా వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదే సమయంలో ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరూ స్వయంగా ఆచరించి తరించేలా దుర్గా విగ్రహాలకు ‘కోటి కుంకుమార్చన’ జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తులంతా ఏకకాలంలో చేసిన ఈ విశేష పూజ కనులపండువగా సాగింది.

వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణోత్సవం.. సింహ వాహన సేవ

నాలుగో రోజు వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ‘వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణం’ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ దివ్య కల్యాణాన్ని కళ్లారా వీక్షించి భక్తులు తరించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారికి అత్యంత విశిష్టమైన ‘సింహ వాహన సేవ’ నిర్వహించారు. సింహ వాహనంపై కొలువుదీరిన ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

పీఠాధిపతుల అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం

ఈ మహా యజ్ఞానికి కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ డా. నిర్మలానందనాథ మహాస్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతులు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ విచ్చేసి భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. ఎస్. అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ఆకట్టుకుంది. అనంతరం లక్షలాది దీపపు కాంతుల నడుమ సాగిన మహా నీరాజనం, స్వర్ణలింగోద్భవం, సప్త హారతులతో కోటి దీపోత్సవం నాలుగో రోజు వేడుకలు అద్భుతంగా ముగిశాయి. ఈ దీప యజ్ఞానికి విచ్చేసిన భక్తులందరికీ రచనా టెలివిజన్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ యాజమాన్యం యథావిధిగా పూజా సామగ్రిని ఉచితంగా అందజేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രിക്കെതിരെ മന്ത്രിമാർ; ക്യാബിനറ്റിൽ തർക്കം

തിരുവനന്തപുരം: മന്ത്രിസഭാ യോഗത്തിനുപിന്നാലെ മുഖ്യമന്ത്രി വി.ഡി.സതീശനെതിരെ മറ്റു മന്ത്രിമാർ.  മുഖ്യമന്ത്രി തീരുമാനമെടുക്കുന്നത്...

അനധികൃത കുടിയേറ്റങ്ങളും അക്രമങ്ങളും ദ്വിരാഷ്ട്ര സാധ്യത ഇല്ലാതാക്കുന്നു; ഇസ്രഈൽ സംഘടനകൾക്ക് ഉപരോധം ഏർപ്പെടുത്തി ഓസ്‌ട്രേലിയ

സിഡ്‌നി: വെസ്റ്റ് ബാങ്കിലെ ഇസ്രഈൽ അനധികൃത കുടിയേറ്റങ്ങൾക്കും അതിക്രമങ്ങൾക്കുമെതിരെ ഉപരോധം ഏർപ്പെടുത്തി...

திருச்சி: நியாய விலைக் கடை அரிசியில் ரூ.22.20 கோடி முறைகேடு; குடும்பமே கைதான பின்னணி என்ன?

திருச்சி மாவட்டம், மணப்பாறை அருகே பொய்கைப்பட்டியில் சண்முகம் (வயது: 57) என்பவருக்குச்...