4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..

Date:

ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించే గడువును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో రెండు రోజులు పొడిగించింది. ఈ మేరకు సోమవారం ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం అందించింది. అసలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15 నాటికి ముగియాల్సిన ఈ గడువును, తాజాగా నవంబర్ 17కి మార్చారు. డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న మినీ ఆక్షన్‌కు ముందు జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ నిర్ణయాలను సమీక్షించుకోవడానికి ఈ అదనపు సమయం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

నవంబర్ 15న మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదో, ఆఖరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్ కారణంగానే బీసీసీఐ రిటెన్షన్ గడువును పొడిగించినట్లు సమాచారం. మరోవైపు, డిసెంబర్ 16న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. సరిగ్గా అదే రోజే ఐపీఎల్ ఆక్షన్ కూడా షెడ్యూల్ కావడం గమనార్హం. అయితే ఈ వన్డే మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చే అంశంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ పొడిగించిన గడువుతో పాటు రాబోయే మినీ ఆక్షన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. సోమవారంతో ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇది నవంబర్ 23తో ముగుస్తుంది. ఆక్షన్‌లో తాము కొనుగోలు చేయాలనుకునే ఆటగాళ్ల తుది జాబితాను ఫ్రాంచైజీలు డిసెంబర్ 1వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 3న ఆటగాళ్ల సెట్ల క్రమంతో కూడిన ఫైనల్ ఆక్షన్ రిజిస్టర్‌ను బీసీసీఐ విడుదల చేస్తుంది. ఈ రెండు రోజుల అదనపు గడువు వల్ల ఫ్రాంచైజీలు ప్రణాళికలు రూపొందించుకోవడానికి, రాబోయే రోజుల్లో జరిగే ప్లేయర్ ట్రేడింగ్ మార్కెట్‌ను బేరీజు వేసుకోవడానికి తగినంత వెసులుబాటు దొరుకుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ന്യൂയോര്‍ക്കില്‍ കൈവരിച്ച നേട്ടങ്ങള്‍ എണ്ണിപ്പറഞ്ഞ് ജെ.ഡി.വാന്‍സ്: ട്രോള്‍ വീഡിയോയുമായി പ്രതികരിച്ച് മംദാനി

ന്യൂയോര്‍ക്ക്: ന്യൂയോര്‍ക്കിനായി ട്രംപ് ഭരണകൂടം കൈവരിച്ചെന്ന് അവകാശപ്പെടുന്ന നേട്ടങ്ങള്‍ സോഷ്യല്‍ മീഡിയയില്‍...

காவல் நிலையத்தில் திடீர் ஆய்வு; லாக்கப்களைப் பார்வையிட்டு அதிகாரிகளுடன் கலந்துரையாடிய முதல்வர் விஜய்

ஈரோடு மாவட்டம், பெருந்துறை பகுதியில் மகளிர் சுய உதவி குழுவினருக்கு கடன்...

Roamie: `பண்டிகைக் கால ஆம்னி பேருந்து கட்டண உயர்வால் அவதிப்படும் மக்கள்'- தீர்வு தருமா ரோமி செயலி?

பண்டிகை காலங்களில் பயணிகளுக்கு இருக்கும் பெரும் சிக்கல்களில் ஒன்று ஆம்னி பேருந்துகளின்...