3
November, 2026

A News 365Times Venture

3
Tuesday
November, 2026

A News 365Times Venture

NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!

Date:

NASA Swift Telescope: అంతరిక్ష పరిశోధనలో 22 ఏళ్ల పాటు సేవలందించిన నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. నాసా అంచనాల ప్రకారం.. ఈ శాటిలైట్ నవంబర్ 6, శుక్రవారం భూమి వాతావరణంలోకి ప్రవేశించనుంది. దీనిని కాపాడేందుకు నాసా చేపట్టిని రెస్క్యూ మిషన్ విషలయమైంది. దీంతో ఇది ఇప్పుడు భూమిపై కూలడం అనివార్యంగా మారింది. 2004లో ప్రయోగించిన స్విస్ట్ అబ్జర్వేటరీ బరువు సుమారు 1.5 టన్నులు. విశ్వంలోని శక్తివంతమైన ఖగోళ సంఘటనల్ని పరిశీలించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

ముఖ్యంగా గామా-కిరణ విస్ఫోటనాల (Gamma-Ray Bursts) అధ్యయనంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు 2,000కు పైగా గామా-కిరణ విస్ఫోటనాలను, దాదాపు 1,400 సూపర్‌నోవాలను గుర్తించింది. దీని ద్వారా విశ్వం ఆవిర్భావం, నక్షత్రాల అంతం, బ్లాక్ హోల్ వంటి అంశాలపై శాస్త్రవేత్తలకు కీలకమైన సమాచారం లభించింది. గామా-రే విస్పోటనాల్లో సూర్యుడు తన జీవితాంతం విడుదల చేసే శక్తిని కేవలం కొన్ని సెకన్లలో విడుదల చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కక్ష్య నుంచి బయటకు.. రెస్క్యూ మిషన్ విఫలం..

దీర్ఘకాలికంగా భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లు వాతావరణంలోని స్వల్ప ఘర్షణ కారణంగా క్రమేపి తమ కక్ష్యను కోల్పోతుంటాయి. స్విఫ్ట్ కూడా ఇలాంటి ప్రభావానికే గురైంది. అయితే, దాని కక్ష్యను పెంచి మరికొన్నేళ్లు సేవలు అందించేలా చేసేందుకు నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇందుకోసం క్యాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థతో 30 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ‘లింక్’ అనే రోబోటిక్ అంతరిక్ష నౌకను పంపి, స్విఫ్ట్‌ను సమీపించి పట్టుకుని, దాని కక్ష్యను పెంచాలనేది ప్రణాళిక. అయితే, ఇందులో ఆగస్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రోబోటిక్ అంతరిక్ష నౌక స్విప్ట్‌కు అవసరమైనంత దగ్గరగా వెళ్లలేకపోయింది. దీంతో నాసా ఈ రెస్క్యూను రద్దు చేయాల్సి వచ్చింది.

నవంబర్ 6న భూమి వాతావరణంలోకి..

నాసా స్విప్ట్ కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. నవంబర్ 6న భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు, కక్ష్యలో మార్పుల కారణంగా అది ఏ సమయంలో, ఏ ప్రాంతంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. భూమి వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించే సమయంలో వాతావరణ ఘర్షణ కారణంగా ఇది ఆకాశంలోనే కాలిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని భాగాలు సముద్రంలో పడిపోతాయని భావిస్తున్నారు. దీని వల్ల పెద్దగా నష్టం లేదని చెబుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാഹുല്‍ ഗാന്ധി വിദേശ ശക്തികളുടെ കയ്യിലെ ടൂള്‍ കിറ്റ്: ഇന്ത്യയെ അസ്ഥിരപ്പെടുത്താന്‍ ശ്രമം: നിതിന്‍ നബിന്‍

ഭഗല്‍പൂര്‍: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ രാംലീല മൈദാനിയില്‍ നടന്ന...

ஓட்டுநர், நடத்துநர் கைகளைப் பிடித்து ரிப்பன் வெட்டிய முதல்வர் விஜய்; புதுக்கோட்டையில் சுவாரஸ்யம்!

தமிழக முதலமைச்சர் சி.ஜோசப் விஜய் புதுக்கோட்டையில் புதிதாகக் கட்டப்பட்டுள்ள பேருந்து நிலையத்தைத்...

OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం

OTR: కమలం పార్టీ తెలంగాణ కదనరంగంలోకి దూకినట్టేనా…? మిషన్‌ తెలంగాణ మొదలైపోయినట్టేనా?...

ടിക്കറ്റ് നിരക്കില്‍ 700 ശതമാനം വര്‍ധനയെന്ന് ഹരജി; വിമാനത്തില്‍ യാത്ര ചെയ്യേണ്ടെന്ന് കോടതി

മുംബൈ: വിമാന ടിക്കറ്റ് നിരക്കില്‍ 700 ശതമാനത്തോളം വര്‍ധനവുണ്ടായെന്നും ഇതില്‍ ഇടപെടല്‍...