2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!

Date:

Rahul Gandhi: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తనకు వ్యక్తిగతమైన ద్వేషం లేదని, అయితే వారు దేశ ఆత్మపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. తాము ద్వేషాన్ని వ్యాప్తి చేయబోమని, హింసకు పాల్పడబోమని, కానీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రతీ భారతీయుడి హక్కులే తమకు మతం కన్నా ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరికీ సమానంగా భాగస్వామ్యం కల్పించే భారత్ కావాలని, రైతులు తమ కష్టానికి ఫలితం పొందాలని, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని కాంక్షించారు. దేశంలో సంపద ఇద్దరు ముగ్గురు చేతిల్లో కేంద్రీకృతమైందని ఆరోపించారు.

2024 ఎన్నికలు చోరీ అయ్యాయి..

2024 లోక్‌సభ ఎన్నికలు చట్ట విరుద్ధంగా జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఎన్నికలను చోరీ చేశారని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా నుంచి 15 శాతం మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు. ఈ వివరాలను ఎన్నికల సంఘమే చెప్పిందని వెల్లడించారు. గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఈవీఎంల ద్వారా, ఓటర్ల జాబితాల్లో పేర్లను తొలగించడం లేదా కొత్త పేర్లను చేర్చడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని విమర్శించారు.

జ్ఞానేశ్ తర్వాత మోడీనే టార్గెట్..

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తామని, ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీ అనేది సాధారణ దొంగతనం కాదని, ప్రజలందరి గొంతుకను దొంగిలించడమేనని రాహుల్ గాంధీ అన్నారు. దీన్ని చట్టపరమైన పరిభాషలో అత్యంత అరుదైన కేసుగా, దేశద్రోహంగా అభివర్ణించారు. జ్ఞానేశ్ కుమార్ లేకపోతే మోడీ ప్రధాని అయ్యే వారు కాదని, అమిత్ షా హోంమంత్రి అయ్యే వారు కాదని ఆరోపించారు. జ్ఞానేశ్ తర్వాత ప్రధాని మోడీ వంతు వస్తుందని, మోడీ ఎక్కడికి వెళ్లలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

దేశంలో రైతులు, యువత, కార్మికులకు వారి హక్కులు దక్కడం లేదని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని విమర్శించారు. మాకు ఇలాంటి దేశం వద్దని అన్నారు. మోడీ ప్రజల్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని, ఈడీలతో భయపెడుతున్నారని, ఇక భయపడేది లేదని రాహుల్ అన్నారు.

పోరాటం కొనసాగిస్తాం..

ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ తమకు శత్రువులు కాదని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై తాము దాడులు చేయబోమని, ద్వేషాన్ని లేదా హింసను ప్రోత్సహించబోమని చెప్పారు. అయితే దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്ഥാനാർഥി പട്ടികയ്ക്ക് പിന്നാലെ എ.എ.പിയിൽ ഭിന്നത; മൂന്ന് എം.എൽ.എമാർ ബി.ജെ.പിയിൽ ചേർന്നു

ന്യൂദൽഹി: 2027-ലെ പഞ്ചാബ് നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിനുള്ള ആദ്യ സ്ഥാനാർഥി പട്ടിക ആം...

"குடிநீர், கழிவறைகூட இல்லை!" – முதல்வர் விஜய்யைச் சந்திக்க வந்த கே.எம்.செரீப் பூட்டி வைப்பு

புதுக்கோட்டை தவெக கூட்டணிக் கட்சி வேட்பாளர் மற்றும் காங்கிரஸ் நிர்வாகிகள்...

புதுக்கோட்டை: இரவோடு இரவாக மாற்றபட்ட முதல்வர் விழா மேடை! – நலத்திட்டப் பயனாளிகள் ஏமாற்றம்

புதுக்கோட்டை மாவட்டத்திற்கு இன்று வருகை தரும் முதலமைச்சர் விஜய் கலந்துகொள்ளும் அரசு...