1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

Date:

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ శివారులోని ప్రముఖ ‘ఎల్జీ (LG) ఫామ్‌హౌస్‌’లో కొందరు యూనివర్సిటీ విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న భారీ పార్టీని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ) మరియు స్థానిక చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు.పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. శంకరపల్లి మండలం దొంతన్‌పల్లి పరిధిలోని ‘ఐబీఎస్ ఇక్ఫాయ్ (IBS IFHE) యూనివర్సిటీ’కి చెందిన బీబీఏ, ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ బృందాలు, చేవెళ్ల పోలీసులు ఒకేసారి ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడి సమయంలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉన్నట్లు, వారిలో దాదాపు 20 నుంచి 25 మంది యువతులు కూడా ఉన్నట్లు సమాచారం.

పోలీసులను చూడగానే విద్యార్థులు పరుగులు తీసే ప్రయత్నం చేయగా, సిబ్బంది అందరినీ చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పార్టీలో మద్యం ఏమైనా అక్రమంగా సరఫరా చేశారా? లేక నిషేధిత మత్తు పదార్థాలు (డ్రగ్స్) ఏవైనా వినియోగించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఫామ్‌హౌస్ యజమాని అనుమతులు, పార్టీ నిర్వాహకుల వివరాలపై ఎస్‌వోటీ ఆరా తీస్తోంది. విద్యాసంస్థల సమీపంలో మరియు శివారు ఫామ్‌హౌస్‌లలో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്ത്യയുടെ ‘പ്രോക്‌സി വാര്‍’ അവസാനിപ്പിക്കുക: ഇംഫാലില്‍ വന്‍ മാര്‍ച്ച്

  ഇംഫാല്‍: മണിപ്പൂരില്‍ ഇന്ത്യ ഗവണ്‍മെന്റിന്റെ പ്രോക്‌സി യുദ്ധം അവസാനിപ്പിക്കണമെന്നും കുക്കി-സോ...

അമേരിക്ക-ഇസ്രഈല്‍ ഭീഷണിക്ക് ഉടന്‍ തിരിച്ചടി; ഇറാന്‍ സായുധസേനയ്ക്ക് ഉത്തരവിട്ട് ഖാംനഇ

ടെഹ്റാന്‍: അമേരിക്കയുടെയും ഇസ്രഈലിന്റെയും ഭാഗത്തുനിന്ന് ഏത് തരത്തിലുള്ള ഭീഷണിയുണ്ടായാലും ഭൂമിശാസ്ത്രപരമായ പരിധികളില്ലാതെ...

அதிமுக-விலிருந்து வேலுமணி, சி.வி.சண்முகம் நீக்கம்? – இ.பி.எஸ் எடுத்த அதிரடி முடிவு?

அ.தி.மு.கவிலிருந்து முன்னாள் அமைச்சர்கள் சி.வி.சண்முகம் மற்றும் எஸ்.பி.வேலுமணியை நீக்க பொதுச்செயலாளர்...