1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..

Date:

విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ దొంగ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు లాడ్జీలు, హోటళ్లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జగదాంబ జంక్షన్‌లోని వి-స్టార్ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. హోటల్ గది నంబర్ 105ను తనిఖీ చేయగా, అక్కడ రూ.500 నోట్ల రూపంలో ఉన్న కలర్ జిరాక్స్ నకిలీ కరెన్సీ కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 200 కట్టల రూపంలో ఉన్న సుమారు 66 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లతో పాటు ఒక డమ్మీ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కొండబాబు, సాయి, దుర్గాప్రసాద్, దినేష్ అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల సమయంలో ఇలా భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ నకిలీ నోట్లు ఎక్కడ ముద్రించారు? ఎవరి ద్వారా నగరానికి తీసుకొచ్చారు? ఎన్నికల వేళ ఓటర్లకు పంపిణీ చేసేందుకు వీటిని సిద్ధం చేశారా లేక ఎవరైనా వ్యాపారులను, ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించాలని భావించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా పెద్దలు ఉన్నారా, నకిలీ కరెన్సీ నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉందనే వివరాలను రాబట్టేందుకు నిందితులను పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്ക-ഇസ്രഈല്‍ ഭീഷണിക്ക് ഉടന്‍ തിരിച്ചടി; ഇറാന്‍ സായുധസേനയ്ക്ക് ഉത്തരവിട്ട് ഖാംനഇ

ടെഹ്റാന്‍: അമേരിക്കയുടെയും ഇസ്രഈലിന്റെയും ഭാഗത്തുനിന്ന് ഏത് തരത്തിലുള്ള ഭീഷണിയുണ്ടായാലും ഭൂമിശാസ്ത്രപരമായ പരിധികളില്ലാതെ...

அதிமுக-விலிருந்து வேலுமணி, சி.வி.சண்முகம் நீக்கம்? – இ.பி.எஸ் எடுத்த அதிரடி முடிவு?

அ.தி.மு.கவிலிருந்து முன்னாள் அமைச்சர்கள் சி.வி.சண்முகம் மற்றும் எஸ்.பி.வேலுமணியை நீக்க பொதுச்செயலாளர்...

മഹാരാജാസ് പ്രതിഷേധത്തിന്റെ പേരില്‍ മിസ്രിയക്കെതിരെ ലീഗ്-കോണ്‍ഗ്രസ് സൈബര്‍ ആക്രമണം അപലപനീയം; പ്രതിപക്ഷ നേതാവ്

തിരുവനന്തപുരം: മഹാരാജാസ് കോളേജില്‍ ഉന്നതവിദ്യാഭ്യാസ മന്ത്രി റോജി എം. ജോണിനോട് ചോദ്യങ്ങള്‍...

Omar Abdullah: ஊடகவியலாளரை மணந்த ஜம்மு & காஷ்மீர் முதல்வர் உமர் அப்துல்லா – வைரலாகும் புகைப்படங்கள்!

ஜம்மு & காஷ்மீர் முதல்வர் உமர் அப்துல்லா, ஊடகவியலாளர் நிதி ரஸ்தான்...