29
October, 2026

A News 365Times Venture

29
Thursday
October, 2026

A News 365Times Venture

OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!

Date:

OTR: ఏపీలో మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్టుగా మారిందా? లోకల్‌ బాడీ ఎలక్షన్‌ కోసం స్టేట్‌ లెవల్‌, నేషనల్‌ లెవల్‌ లీడర్స్‌ ఎందుకు తరలి వస్తున్నారు? అదే సమయంలో అధికార పక్షంలోని లూప్‌హోల్స్‌ ప్రతిపక్షానికి వరంలా మారుతున్నాయా? పైగా పవర్‌ ఉన్న వాళ్ళు ఇస్తున్న ఒక్కో హామీని విశ్లేషించి వైసీపీ చీల్చి చెండాడుతోంది ఎక్కడ? ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేకత ఏంటి? ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరుతోంది. అన్ని చోట్లా హోరా హోరీ ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సమరం మాత్రం అన్నిటికంటే ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు మారిపోయిందట. ఇది కేవలం ఒక స్థానిక సంస్థల ఎన్నిక కాదు… ఒక జీవన్మరణ సమస్య అన్నట్టు మారిపోయిందని అంటున్నారు. కీలకమైన అనంతపురం మేయర్ సీటును పట్టుబట్టి తీసుకుంది బీజేపీ. ఇక్కడ ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని భావించిన కమలం నాయకత్వం…. డాక్టర్ విక్రమ్‌ను రంగంలోకి దించాలని మొదట్లో గట్టి ప్రయత్నాలు చేసింది.

కానీ, బలంగా ఉన్న ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి వ్యూహాలు అవసరమని భావించి.. ఆఖరి నిమిషంలో అజేష్ యాదవ్‌ను తెరపైకి తెచ్చింది. కానీ… అజేష్ కొత్త వ్యక్తి కావడమే ఇప్పుడు కూటమికి ఒక పెద్ద సవాల్‌గా మారిందని అంటున్నారు. దీనికి పూర్తి భిన్నంగా వైసీపీ తరపున నిలిచిన బీసీ నేత రమేష్ గౌడ్ నగరంలో అందరికీ సుపరిచితుడు, వివాదరహితుడు. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నారన్న పేరుంది ఆయనకు. దీంతో… బీజేపీ పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. పట్టుబట్టిమరీ సీటు తీసుకోవడం, తమ అభ్యర్థి కొత్త కావడం, లోకల్‌గా తమ బలం, టీడీపీ సహకారం ఎంతవరకు అంటుందన్న అనుమానం, అలాగే లోకల్‌ టీడీపీ ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకత లాంటివన్నీ కలగలిసి ఎక్కడ తమ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బ కొడతాయోనంటూ కమల నాథులు తెగ కంగారు పడుతున్నారట. ఇంకా చెప్పాలంటే… అనంతపురం మేయర్‌ సీటు గెలిపించుకోవడం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సవాల్‌గా మారిందంటున్నారు పరిశీలకులు. అందుకే పార్టీ తరపున హేమాహేమీలను ప్రచార పర్వంలోకి దించారట. ఎంపీ పురందేశ్వరి, ఆర్. కృష్ణయ్య, సినీనటుడు సాయికుమార్, లాంటి అగ్రనేతలంతా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే… ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో కూటమికి బయటి వాళ్ళకంటే… అంతర్గత సమస్యలే పెద్ద ప్రమాదకరంగా మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య ఉన్న అలకలు ఎక్కడ కూటమి కొంపముంచుతాయోనని బీజేపీ అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోందట. ఈ విభేదాలు కూటమి విజయానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో, మంత్రి సత్యకుమార్ స్వయంగా రంగంలోకి దిగి సంధి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను ఏకం చేసి, విభేదాలన్నింటినీ పక్కన పెట్టి కూటమి అభ్యర్థి కోసం పని చేసేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ క్రమంలో ఇస్తున్న కొన్ని భారీ హామీలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. అనంతపురంలో ట్యాంక్ బండ్ నిర్మాణం, ఎయిర్‌పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భూగర్భ కేబులింగ్ అంటూ… చాలా పెద్దపెద్ద హామీలే ఇస్తున్నారు కూటమి నేతలు. అగే పాయింట్‌ను తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో ఉంది వైసీపీ. వాళ్ళు చెబుతున్నవాటన్నిటినీ నమ్ముతారా? అనంతపురంలో ఎయిర్‌ పోర్ట్‌, భూ గర్భ కేబులింగ్‌ అంటే నమ్ముతారా ? అవన్నీ కల్లబొల్లి కబుర్లు అంటూ మైండ్‌ గేమ్‌ మొదలుపెట్టింది విపక్షం. కూటమి నేతలు ఇస్తున్న ఒక్కో హామీకి, ప్రస్తుత పరిస్థితుల్ని జోడిస్తూ…వైసీపీ స్టార్ట్‌ చేసిన గేమ్‌ ఆసక్తి రేపుతోంది. పక్కా వ్యూహం ప్రకారం ప్రతిపక్షం చేస్తున్న ఈ ప్రచారం ఇప్పుడు అనంతపురం మున్సిపల్ పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చేసింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈല്‍ തെരഞ്ഞെടുപ്പ്; റെക്കോഡ് പോളിങ്ങിനിടെ നാല് അറബ് ലിസ്റ്റ് പ്രവര്‍ത്തകരെ അറസ്റ്റ് ചെയ്തു!

ജറുസലേം: ഇസ്രഈല്‍ പാര്‍ലമെന്റ് തെരഞ്ഞെടുപ്പില്‍ അറബ് പാര്‍ട്ടികളുടെ മുന്നേറ്റത്തിന് പിന്നാലെ റാം...

`நான் இல்லை என்றாலும் தொண்டர்கள் பணியாற்றுவார்கள்; திசை திருப்பவே இந்தச் சோதனை!' – கே.என்.நேரு

முன்னாள் தி.மு.க அமைச்சர் கே.என்.நேருவின் திருச்சியில் உள்ள வீட்டில் லஞ்ச ஒழிப்புத்துறையினர்...

മോദി സര്‍ക്കാര്‍ അമേരിക്കയ്ക്ക് മുന്നില്‍ വിധേയരാണ്: ഹര്‍ദീപ് സിങ് പുരിയുടെ സ്ഥാനാര്‍ത്ഥിത്വത്തില്‍ കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: കേന്ദ്രമന്ത്രി ഹര്‍ദീപ് സിങ് പുരിയെ രാജ്യസഭാ ഉപതെരഞ്ഞെടുപ്പിലേക്ക് നാമനിര്‍ദേശം ചെയ്തതില്‍...

வேலூர் திமுக மாவட்டச் செயலாளர், தொழிலதிபர் சேகர் ரெட்டி வீடுகளில் ரெய்டு; லஞ்ச ஒழிப்புத்துறை அதிரடி!

தி.மு.க வேலூர் தெற்கு மாவட்டச் செயலாளரும் அணைக்கட்டு தொகுதி முன்னாள் எம்.எல்.ஏ-வுமான...