29
October, 2026

A News 365Times Venture

29
Thursday
October, 2026

A News 365Times Venture

Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్‌’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..

Date:

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి అతితీవ్ర తుఫాన్ అర్నబ్ వేగంగా దూసుకొస్తోంది. తుఫాన్‌ బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, కాకినాడ సమీపంలో యానాం దగ్గర తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుఫాన్‌ పూర్తిస్థాయిలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక, గడిచిన 6 గంటల్లో అర్నబ్ తుఫాన్‌ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 90 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 170 కిలోమీటర్లు, బాపట్లకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు.

తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
అర్నబ్ తుఫాన్‌ తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్‌ తీరం దాటిన అనంతరం తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి 28 ప్రాంతాల్లో అతిభారీ వర్షపాతం నమోదుకాగా, మరో 133 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

మరోవైపు.. తుఫాన్‌ తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പശുവിനെ അറുത്തെന്ന കേസില്‍ മനുസ്മൃതി ഉദ്ധരിച്ചുകൊണ്ട്‌ കോടതി മുസ്‌ലിം യുവാക്കളെ ജീവപര്യന്തം ശിക്ഷിച്ചു

ഗാന്ധിനഗര്‍: പശുവിനെ അറുത്തതുമായി ബന്ധപ്പെട്ട കേസില്‍ മൂന്ന് മുസ്‌ലിം യുവാക്കളെ ജീവപര്യന്തം...

"திருநீறு, ருத்ராட்சையுடன் திருவள்ளுவர் ஓவியம்; திருப்பரங்குன்றம் விவகாரத்திலும்..!"- வானதி கோரிக்கை

தமிழ்நாட்டில் திருவள்ளுவர் என்றாலே வெள்ளை உடையில், அமைதியான தோற்றத்தில் காட்சியளிக்கும் உருவம்தான்...

ഇന്ത്യമുന്നണി റാലിക്ക് പിന്തുണയുമായി സി.ജെ.പി; സ്വതന്ത്രവും നീതിയുക്തവുമായ തിരഞ്ഞെടുപ്പിനായി പോരാടുന്ന എല്ലാവര്‍ക്കും പിന്തുണ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി, എസ്.ഐ.ആര്‍ നടപടികള്‍...

“தேவையற்ற வதந்திகள்.. "- கொளத்தூர் எம்.எல்.ஏ வி.எஸ் பாபு உடல்நிலை குறித்து அமைச்சர் மரிய வில்சன்

அமைச்சர் மரிய வில்சன் சென்னையில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது, ``அன்பில் மகேஸ்...