24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!

Date:

Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చేసింది 29 పరుగులే అయినా అరుదైన రికార్డులు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా 226 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఆరో ఓవర్ నాలుగో బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్ సంజు శాంసన్‌తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే అభిషేక్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పవర్‌ప్లే సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును అధిగమించాడు. పవర్‌ప్లేలో ఇప్పటివరకు 99 సిక్సర్లు బాదిన అభిషేక్.. 98 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో మార్టిన్ గప్టిల్ 97 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్ తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 99 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 98, మార్టిన్ గప్టిల్ 97, యూఏఈకి చెందిన ముహమ్మద్ వసీమ్ 95, ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 94 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అభిషేక్ ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 146 సిక్సర్లు బాదాడు. కేవలం పవర్‌ప్లేలోనే 99 సిక్సర్లు సాధించడం అతడి దూకుడైన బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలుస్తుంది.

అభిషేక్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న అభిషేక్.. తన తొలి బంతికే సిక్స్ బాదాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధికసార్లు సిక్స్ కొట్టిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అభిషేక్ ఇప్పటివరకు 7 సార్లు తొలి బంతికే సిక్స్ కొట్టాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారీ రికార్డును అధిగమించాడు. షిన్వారీ 6 సార్లు తొలి బంతికే సిక్స్ కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్ 5 సార్లు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా న్యూజిలాండ్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വെടിനിര്‍ത്തലിന് മധ്യസ്ഥത വഹിച്ച് മെലാനിയ ട്രംപ്: ഉക്രൈന്‍ നഗരം നാശത്തിന്റെ വക്കിലെന്ന് റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: റഷ്യന്‍ അധിനിവേശത്തിലുള്ള ഒലഷ്‌കി നഗരത്തില്‍ റഷ്യയും ഉക്രൈനും തമ്മില്‍ വെടിനിര്‍ത്തല്‍...

‘அண்ணாமலை தன் அறிவுஜீவித்தனத்தை அமித் ஷா மோடியிடம் காட்டுவதோடு நிறுத்திக்கொள்ள வேண்டும்’ – காங்கிரஸ்

"பா.ஜ.க தலைவர்களிடம் பம்மாத்து காட்ட மட்டும் பயன்படுத்துங்கள். பா.ஜ.க-வின் பின் ஒளிந்து...

Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!

Shreyas Iyer: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత...