23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!

Date:

Sanju Samson: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి భారత విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో 2026 క్యాలెండర్ ఇయర్‌లో ఎనిమిదోసారి 50కి పైగా స్కోరు నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించారు. తొలి ఓవర్ నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన శాంసన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ కూడా 12 బంతుల్లో 29 పరుగులతో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 5.5 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 94/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో శాంసన్ 67 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఈ అర్ధశతకంతో శాంసన్ మరో అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువసార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉంది. అతడు 2022లో ఏకంగా 11 సార్లు ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ అదే ఏడాది 9 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. 2026లో అభిషేక్ శర్మ ఇప్పటికే 9 సార్లు ఈ మార్క్ అందుకోగా.. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ చెరో 8 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశారు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డుకు శాంసన్ ఒక్క 50+ స్కోరు దూరంలో నిలిచాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనే మరోసారి అర్ధశతకం సాధిస్తే కోహ్లీ 9 స్కోర్ల రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ శాంసన్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ 32 సార్లు 50+ స్కోర్లతో అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్ 21, అభిషేక్ శర్మ 17తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శాంసన్ ఖాతాలో ఇప్పుడు 12 సార్లు 50+ స్కోర్లు చేశాడు. సంజూ శాంసన్ టీ20 కెరీర్‌లో అత్యంత వేగంగా చేసిన అర్ధశతకాల జాబితాలో క్రైస్ట్‌చర్చ్ ఇన్నింగ్స్ కూడా చేరింది. 2026లో అఫ్గానిస్థాన్‌పై ఢిల్లీలో, వెస్టిండీస్‌పై హైదరాబాద్‌లో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశాడు. వెస్టిండీస్‌పై రాంచీలో 21 బంతులు, 2024లో బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో 22 బంతుల్లో అర్ధశతకాలు నమోదు చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌పై 23 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ చేరుకున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അവന്‍ വെറും തീവ്രവാദിയല്ലേ, അല്ലാതെ ദേശീയ പതാക ഉയര്‍ത്തിയതൊന്നുമല്ലല്ലോ: അമേരിക്കന്‍ പൗരന്റെ ജാമ്യം നീട്ടിയതില്‍ അഭിജീത് ദീപ്‌കെ

ന്യൂദല്‍ഹി: മ്യാന്‍മറില്‍ ഭീകരവാദ പരിശീലനം നല്‍കിയ അമേരിക്കന്‍ പൗരനെ യു.എസിലേക്ക് തിരികെ...

"பெண்களே, சிறுமிகளே… உதவி செய்வதாக தவெகவினர் வந்தால் காவல்துறையை அணுகுங்கள்!"- எடப்பாடி பழனிசாமி

கன்னியாகுமரியில் கல்லூரி மாணவி ஒருவருக்கு தவெக நிர்வாகி பாலியல் தொல்லை கொடுத்த...

മോദിയെയും അദാനിയെയും കുറിച്ചുള്ള ഡോക്യുമെന്ററി എക്‌സില്‍ പങ്കുവെച്ചതിന് 24 പേര്‍ക്കെതിരെ നോട്ടീസ്

മുംബൈ: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയെയും വ്യവസായി ഗൗതം അദാനിയെയും കുറിച്ചുള്ള ഡോക്യുമെന്ററി...

ஒன்றிய – மாநில உறவு குறித்து திமுக அரசு அமைத்த கமிட்டி; கிடப்பில் போடும் தவெக அரசு? – பின்னணி என்ன?

ஒன்றிய - மாநில அரசுகளின் உறவு குறித்த சிக்கல்களை ஆராய ஓய்வுபெற்ற...