21
October, 2026

A News 365Times Venture

21
Wednesday
October, 2026

A News 365Times Venture

Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!

Date:

Chinmay Sutar: రంజీ ట్రోఫీ 2026-27 రెండో రౌండ్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. నాగాలాండ్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఏకంగా 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో సుతార్ రంజీ ట్రోఫీ చరిత్రలో క్వాడ్రుపుల్ సెంచరీ (400) సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 77 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 29 ఏళ్ల చిన్మయ్ సుతార్ సోమవారం రెండో రోజు ఆటను 181 పరుగుల వద్ద కొనసాగించి ఈ మైలురాయిని అందుకున్నాడు. మొత్తం 517 బంతులు ఎదుర్కొని 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీనితో మిజోరం జట్టు 581/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

రంజీ ట్రోఫీలో ఇంతకుముందు క్వాడ్రుపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ బీబీ నింబాల్కర్. 1948-49 సీజన్‌లో కాఠియావార్‌పై మహారాష్ట్ర తరఫున నింబాల్కర్ 443 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇప్పుడు 77 ఏళ్ల తర్వాత చిన్మయ్ సుతార్ 400 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే సుతార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మణిపూర్‌తో తన తొలి మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు సాధించాడు. అంతకుముందు జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రపై ముంబై తరఫున లిస్ట్-A క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు పరుగులకే రనౌట్ అయ్యాడు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో భారత ఎమర్జింగ్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

సుతార్ అద్భుత ఇన్నింగ్స్‌కు 11వ నంబర్ బ్యాటర్ లాల్‌రెంపుయియా చక్చువాక్ కూడా మంచి సహకారం అందించాడు. మిజోరం 392 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతడు 76 బంతులు ఎదుర్కొని 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వికెట్ భాగస్వామ్యంలో వీరిద్దరూ ఏకంగా 189 పరుగులు జోడించారు. మిజోరం జట్టులో సుతార్ తర్వాత అత్యధిక స్కోరు జెహూ ఆండర్సన్ చేసిన 69 పరుగులే. దీంతో జట్టు మొత్తం స్కోరులో సుతార్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో 443 పరుగులతో బీబీ నింబాల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. 400* పరుగులతో చిన్మయ్ సుతార్ రెండో స్థానానికి చేరాడు. ఆ తర్వాత పృథ్వీ షా (379), సంజయ్ మంజ్రేకర్ (377), ఎంవీ శ్రీధర్ (366), తనయ్ అగర్వాల్ (366), విజయ్ మర్చంట్ (359*), సమిత్ గోహెల్ (359*), వీవీఎస్ లక్ష్మణ్ (353) ఉన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ദല്‍ഹിയിലെ പ്രതിഷേധങ്ങള്‍: പൊലീസ് അതിക്രമങ്ങളില്‍ ആശങ്ക പ്രകടിപ്പിച്ച് യു.എന്‍ മനുഷ്യാവകാശ വിദഗ്ധര്‍

ജനീവ: ഇന്ത്യയില്‍ മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ടുകൊണ്ടുള്ള...

இந்தியாவில் மார்கோ ரூபியோ! இந்தியா – அமெரிக்கா ஒப்பந்தம் விரைவில்?! ரூபியோ சொல்லும் தகவல் என்ன?

ரஷ்யாவிடமிருந்து கச்சா எண்ணெய் வாங்கும் இந்தியாவின் முடிவு, அமெரிக்காவின் வரி நடவடிக்கைகளில்...

വഖഫ് ബോര്‍ഡ്: എ.പി വിഭാഗം പ്രതിനിധികള്‍ വരുമെന്ന് മന്ത്രി എന്‍. ഷംസുദ്ദീന്‍

തിരുവനന്തപുരം: വഖഫ് ബോര്‍ഡ് ഭരണ സമിതിയില്‍ എ.പി സമസ്ത വിഭാഗം പ്രതിനിധികള്‍...

"பல்லவன் இல்லத்தில் தலைமைச் செயலகமா? மீண்டும் தவறான முடிவு..!" – அன்புமணி ராமதாஸ்

பாமக தலைவர் அன்புமணி ராமதாஸ் வெளியிட்டுள்ள அறிக்கையில் "சென்னை பட்டினப்பாக்கத்தில் வீட்டு...