21
October, 2026

A News 365Times Venture

21
Wednesday
October, 2026

A News 365Times Venture

Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

Date:

Asian Para Games: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. టోర్నమెంట్ తొలి రోజే భారత క్రీడాకారులు 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు కలిపి మొత్తం 11 పతకాలు సాధించారు. పారా అథ్లెటిక్స్ పురుషుల లాంగ్‌జంప్ T47 విభాగంలో నిషాద్ కుమార్ 7.11 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించాడు. మహిళల 1500 మీటర్ల టీ12/T13 విభాగంలో సౌమ్య స్వర్ణం గెలవగా, రాధా వెంకటేశ్ రజతం సొంతం చేసుకుంది. మహిళల 1500 మీటర్ల టీ11 విభాగంలో రవన్ని వలసనైని కాంస్యం సాధించింది.

మరోవైపు పురుషుల జావెలిన్ త్రో F46 విభాగంలో రింకు స్వర్ణ పతకం సాధించగా, అజీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. షూటింగ్‌లోనూ భారత్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించగా, అవని లేఖరా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. జూడోలో మహిళల J2-52 కేజీల విభాగంలో కోకిల రజతం సాధించగా, పురుషుల జే1-70 కేజీల విభాగంలో కపిల్ పర్మార్ కాంస్య పతకం గెలిచాడు. పారా స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో రవి కార్తీక్ రజత పతకం సాధించాడు. మొత్తంగా తొలిరోజే 11 పతకాలతో సత్తా చాటిన భారత పారా అథ్లెట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!

Chinmay Sutar: రంజీ ట్రోఫీ 2026-27 రెండో రౌండ్‌లో మిజోరం బ్యాటర్...

വഖഫ് ബോര്‍ഡ്: എ.പി വിഭാഗം പ്രതിനിധികള്‍ വരുമെന്ന് മന്ത്രി എന്‍. ഷംസുദ്ദീന്‍

തിരുവനന്തപുരം: വഖഫ് ബോര്‍ഡ് ഭരണ സമിതിയില്‍ എ.പി സമസ്ത വിഭാഗം പ്രതിനിധികള്‍...

"பல்லவன் இல்லத்தில் தலைமைச் செயலகமா? மீண்டும் தவறான முடிவு..!" – அன்புமணி ராமதாஸ்

பாமக தலைவர் அன்புமணி ராமதாஸ் வெளியிட்டுள்ள அறிக்கையில் "சென்னை பட்டினப்பாக்கத்தில் வீட்டு...

WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!

WPL 2027 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు...