16
October, 2026

A News 365Times Venture

16
Friday
October, 2026

A News 365Times Venture

Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!

Date:

ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తీవ్ర మానసిక సంఘటర్షణకు గురైనట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. 34 ఏళ్ల వయసులో అక్టోబర్ 12న టెక్సాస్‌లో ఆర్జే మిట్టే మరణించాడు. అయితే మరణానికి ముందు కాబోయే భార్య కెన్నెడీ సువారెజ్‌తో నెలకొన్న విభేదాలు కారణంగానే చనిపోయినట్లుగా టీఎంజెడ్ (TMZ) కథనం ప్రచురించింది.

H1

ఆర్జే మిట్టేకు తన తల్లి డైనా, సోదరి లాసియాన్‌తో ఉన్న రక్త సంబంధంపై ప్రియురాలు కెన్నెడీ సువారెజ్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ‘తల్లి కావాలా? నేను కావాలా?’ అని ప్రేమికురాలు అల్టిమేటం విధించినట్లుగా పేర్లు వెల్లడించని వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనం పేర్కొంది. ఎటు తేల్చుకోలేకే మిట్టే ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన వ్యక్తిగత విభేదాలే చావుకు కారణమని సమాచారం.

H2

టీఎంజెడ్ కథనం ప్రకారం.. మిట్టే, కెన్నెడీ సువారెజ్ మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. తమ వ్యక్తిగత జీవితంలో మిట్టే తల్లి జోక్యం చేసుకుంటున్నారని కెన్నెడీ భావించినట్లు కథనం పేర్కొంది. తనకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుకున్నట్లు పేర్లు వెల్లడించని వర్గాలు తెలిపినట్లు వార్త వెలువడింది. మరోవైపు మిట్టేకు తన తల్లి డైనా, సోదరి లాసియాన్‌తో మంచి అనుబంధం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు దూరం కావడం ఆయనకు ఇష్టం లేదని, ఈ పరిస్థితి జంట మధ్య విభేదాలకు దారితీసి ఉండవచ్చని కథనం పేర్కొంది. అయితే ఈ కథనంపై మిట్టే కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు స్పందించలేదు.

పదేళ్ల స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. నిశ్చితార్థం

ఆర్జే మిట్టే, కెన్నెడీ సువారెజ్ దాదాపు పదేళ్లుగా స్నేహితులుగా ఉన్నారని, 2020లో ప్రేమలో పడినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత 2025 అక్టోబర్ 10న వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. మిట్టే మరణానికి వారం రోజుల ముందు వరకు ఇద్దరూ కలిసి ఉన్నారని టీఎంజెడ్ కథనం పేర్కొంది. అయితే చివరి రోజుల్లో ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయంపై అధికారిక సమాచారం లేదు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇനി ആഴ്ചയില്‍ 40 മണിക്കൂര്‍ ജോലി: തെരഞ്ഞെടുപ്പിന് മുമ്പെ ഭേദഗതിയുമായി ലുല ഡ സില്‍വ

ബ്രസീലിയ: ആഴ്ചയില്‍ 44 മണിക്കൂര്‍ ജോലിസമയം എന്നത് 40 മണിക്കൂര്‍ ആയി...

'லண்டன், ஆந்திரா போல உள்ளூர் மளிகைக் கடைக்கும் ஒரு எட்டு போங்க.!'- முதல்வரை விமர்சித்த ஸ்டாலின்

சமீபகாலமாக அரிசி, பருப்பு, காய்கறிகள் உள்ளிட்ட அத்தியாவசியப் பொருட்களின் விலை கடுமையாக...

വധശിക്ഷയുടെ തത്സമയ സംപ്രേഷണം: ആഗോളതലത്തിലുള്ള എതിര്‍പ്പിനെത്തുടര്‍ന്ന് തീരുമാനം റദ്ദാക്കി ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ടെക്‌സസിലെ ഫോര്‍ട്ട് ഹുഡ് സൈനികത്താവളത്തില്‍ 13 പേരെ കൊലപ്പെടുത്തിയ മുന്‍...

ரஷ்யப் போரில் உக்ரைனை ஆபத்தில் தள்ளியதா Starlink? உக்ரைனின் குற்றச்சாட்டும் SpaceX நடவடிக்கையும்!

ஸ்டார்லிங்க் செயற்கைக்கோள் சேவைகளின் வேகத்தைக் குறைத்து உக்ரைனின் ராணுவ நடவடிக்கைகளை ஸ்பேஸ்...