15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?

Date:

OTR: కరపత్రాల యుద్ధానికి కారకులెవరు? తండ్రీ కొడుకులైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసిందెవరు? ఇద్దరూ కలిసి…. కష్టకాలంలో కాంగ్రెస్‌ జెండా మోసిన వాళ్ళను తొక్కేస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? కడుపు మండిన సొంత పార్టీలోని వేరే గ్రూప్‌ ఆ పని చేసిందా? లేక విపక్షమే ఆ రూపంలో అగ్గి రాజేసిందా? అసలేంటా పాంప్లేట్‌ వార్‌? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది?. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచారు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి. అంతకు ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యే…. తన తండ్రి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డితో కలిసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు . బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న దామోదర్ రెడ్డి…. పార్టీ మారినా పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతూ ఉన్నారు. ఇక…1989లో చివరి సారిగా నాగర్ కర్నూలు అసెంబ్లీ సీటును గెల్చుకున్న కాంగ్రెస్‌….. తిరిగి 34 ఏళ్ళ తర్వాత గత ఎన్నికల్లో పాగా వేయగలిగింది.

ఇక రాజేశ్ రెడ్డి తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ…ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు నియోజకవర్గం అధికార పార్టీ శిబిరంలో కరపత్రాల ఎపిసోడ్ కాకరేపుతోంది. ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వ్యవహార శైలిని ఎండగడుతూ, విమర్శలు గుప్పించడంతో పాటు… భూ వ్యవహారాలు, పైరవీలు, ఇసుక దందాల్లాంటి అంశాలను ఆ కరపత్రాల్లో ప్రస్తావించడం కందనూలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. పార్టీ కోసం జెండాలు మోసి.. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఇప్పుడు గుర్తింపు కరువైందని, తండ్రి కొడుకుల రాజకీయంతో సాధారణ కార్యకర్తలు నలిగిపోతున్నారని కరపత్రంలో పేర్కొనడం అధికార పార్టీలో రాజుకుంటున్న తీవ్ర అసంతృప్తికి అద్దంపడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరో పక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళితే…. ఆయన తండ్రి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి… తమను పురుగుల్లా చూస్తున్నారని, మీకు ఇక్కడేం పని..? ఎందుకొచ్చారంటూ చులకన చేసి మాట్లాడుతున్నారంటూ అందులో ఆవేదన వ్యక్తం చేయడం కాంగ్రెస్‌ శిబిరంలో చర్చనీయాంశమైంది. దీంతో… అది ఎవరి పని అయి ఉంటుందంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నాయి వివిధ వర్గాలు. ఆకాశ రామన్నలాగా ఎవరు రాశారో గానీ…. తండ్రీ కొడుకుల్ని బాగా దగ్గరి నుంచి గమనిస్తున్న వాళ్ళే అయి ఉంటారంటూ విశ్లేషిస్తన్నారు చాలా మంది. ఆయా మండలాల్లో మొదటి నుంచి కష్టపడ్డ, పని చేసిన వారిని లైట్ తీసుకుంటూ, వెనక వచ్చిన వారికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అలాగే… నాగర్ కర్నూలు పట్టణంలో భూ వ్యవహారాలకు, ఆయా మండలాల్లో ఇసుక అక్రమ రవాణాకు కూడా వీళ్ళ అనుచరులే బాధ్యులంటూ ఆరోపిస్తోంది వ్యతిరేక శిబిరం. ఇక పైరవీలన్నీ ఓ సామాజిక వర్గం పేటెంట్‌గా మారిపోయాయంటూ లోకల్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

మరో పక్క వ్యవహారం ఏదైనాసరే… తండ్రి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తప్ప… ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇక కరపత్రంలో ప్రస్తావించిన అంశాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపగా…. వెనుక ఎవరున్నారంటూ తెగ ఎంక్వైరీ చేసేస్తోందట కూచుకుళ్ల అండ్ టీం. పోలీసులు కూడా తమదైన శైలిలో… ఆ ఆకాశరామన్న ఎవరంటూ వెదుకుతున్నట్టు సమాచారం. అయితే ఇదంతా తమ క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న కుట్రగా చెబుతోంది ఎమ్మెల్యే శిబిరం. కానీ… అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన , అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పార్టీ నాయకత్వం, వ్యవహారశైలిపై వాళ్ల క్యాడరే రాసుకున్న కరపత్రంగా చెబుతోంది బీఆర్‌ఎస్‌. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల ఆవేదనకు ఇది అద్దం పడుతోందని సెటైర్స్‌ వేస్తోంది విపక్షం. ఈ ఎపిసోడ్‌పై ఇంటలిజెన్స్ విభాగం కూడా ఆరా తీస్తోందట. మొత్తం మీద కరపత్రాల ఎపిసోడ్ నాగర్ కర్నూలు రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. అప్పటికైనా….పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్త స్వరాలకు పరిష్కారం చూపి .. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సబ్ కా రాస్తా ఏక్ హై అని ముందుకు సాగితే బావుంటుందని అంటోంది కాంగ్రెస్‌ కేడర్‌.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

റോഡ് ‘സൗന്ദര്യവത്കരണം’ അപകടമുണ്ടാക്കുന്നു; ബംഗാള്‍ സര്‍ക്കാരിനെതിരെ പ്രതിപക്ഷം

കൊല്‍ക്കത്ത: ദുര്‍ഗാ പൂജയോടനുബന്ധിച്ചുള്ള സൗന്ദര്യവത്കരണത്തിന്റെ ഭാഗമായി റോഡില്‍ മഴവില്‍ നിറത്തില്‍ പെയന്റടിച്ച്...

'ரசிகர் மன்றம் டு நற்பணி இயக்கம்; புதிய கொடி அறிமுகம்!' – கோவையில் தனுஷின் அடுத்த மூவ்!

நடிகர் தனுஷின் அகில இந்திய தனுஷ் ரசிகர் மன்றத்தை தனுஷ் நற்பணி...

மின் கொள்முதல்: “கூடுதல் செலவானாலும் மின்சாரம் வாங்க காரணம் இதுதான்" – அமைச்சர் நிர்மல் குமார்

தமிழ்நாடு அரசியலில் மின்சாரத்துறை ஒரு யூனிட் மின்சாரத்தை ரூ.35-க்கு வாங்கவிருக்கும் செய்தி...