15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!

Date:

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తుని వైసీపీ నేత యనమల కృష్ణుడు, పెద్దాపురం, కాకినాడ రూరల్‌కు చెందిన కొందరు నేతలు కూడా.. వైసీపీని వదిలి జనసేన కండువా కప్పుకున్నారు. జిల్లా పార్టీ నేతలు.. పార్టీ అధ్యక్షుడిని ఒప్పించి ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్లారు. ఒకప్పుడు ఢీ అంటే ఢీ అంటూ… పోట్లాడిన నాయకులే… ఇప్పుడు కూటమి నేతలుగా చెలామణి అవుతున్నారు. అందులో కొందరైతే… కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఇటీవలి వరకు స్థానిక ప్రజా ప్రతినిధులుగా లీడ్ తీసుకున్న వాళ్ళు సైతం ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ చేరికలతో… మొదట్నుంచి ఉన్న నాయకులు తెగ ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చేశారు, మనల్ని వేధించారు. మన గవర్నమెంట్‌ వచ్చిందని సంబరపడుతుంటే… ఇప్పుడు కండువాలు మార్చేసి జంప్‌ అయిపోయారు. మళ్ళీ వాళ్ళ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట. స్థానిక ఎన్నికల్లో మళ్లీ వాళ్లే హంగామా చేస్తారా అని అడుగుతున్నట్టు తెలుస్తోంది.

కాకినాడ జిల్లాలో జనసేన ఎక్కువ స్థానాలు కోరుకుంటోంది. పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో… అందుకు అనుగుణంగా ప్రయారిటీ కోరుకుంటోందట. అయితే… ఇప్పుడు కొత్తగా చేరుతున్న వీళ్ళందరి వల్ల ఉపయోగం ఏంటని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అయిపోతున్నట్టు తెలిసింది. వైసీపీ నుంచి జనసేనలోకి జంప్‌ అయి… ఆ పార్టీ కోటాలో మళ్ళీ వాళ్ళే పదవులు ఎగరేసుకుని పోతే… మేం చేతులు ముడుచుకుని సినిమా చూస్తూ కూర్చోవాలా అంటూ కూటమి పాత నేతలు గట్టిగానే ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఫైట్ చేశామన్న సంగతి గుర్తు చేస్తున్నారట. కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడ్డవాళ్ళతో ఇప్పుడు పని లేదా అంటున్నారట. వైసీపీ టూ కూటమి… వయా జనసేన స్ట్రాటజీ కరెక్ట్ కాదని అంటున్నట్టు సమాచారం. టీడీపీ నాయకులు ఈ పాయింట్‌ని ఎక్కువగా రెయిజ్‌ చేస్తున్నారు. వారికి కొందరు జనసైనికులు కూడా కోరస్ పాడుతున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో కాకినాడ కార్పొరేషన్‌తో పాటు పిఠాపురం, పెద్దాపురం, తుని, సామర్లకోట మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే… గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు ఉన్నాయి. ప్రతి చోట కొత్తగా వచ్చిన వాళ్ళు వడ్డించిన విస్తరిని హ్యాపీగా తినేస్తారా అని జనసేనలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు పరేషాన్ అవుతున్నారట. బలంగా ఉన్నచోట వాళ్ళ చేరికలతో ఓవర్ లోడ్ అవ్వడం తప్ప ఒరిగేదేం లేదని డైరెక్ట్‌గానే అంటున్నట్టు సమాచారం. అదే సమయంలో కొత్తగా చేరిన వాళ్లు కూడా… మీతో బండి లాగే పరిస్థితి లేదు కాబట్టే కదా… మాకు ప్రయారిటీ ఇస్తున్నారంటూ రివర్స్‌ పంచ్‌లు పేలుస్తున్నట్టు చెబుతున్నారు.ఎవరు ఎక్కడ ఉన్నా…. సొంత ఇమేజ్ ఉంటేనే కదా గుర్తింపు అంటూ దీర్ఘాలు తీస్తున్నట్టు తెలుస్తోంది.

రాజకీయాల్లో ఇదంతా ఒక స్టాటజీ అని, ప్రయోజకులు కాని వాళ్ళు ఎంతమంది ఉంటే మాత్రం ఉపయోగం ఏంటని రివర్స్‌ క్వశ్చన్‌ వేస్తున్నారట. కానీ… ఎన్నికల టైంలో పార్టీ మారేవాళ్ళు తమ వర్గాన్ని కాపాడుకోవడానికే…. అలా చేస్తుంటారని, ఒకసారి అవసరం తీరాక కావాలనుకుంటే పక్కకు వెళ్ళిపోతారంటూ పాత కూటమి నాయకులు పెదవి విరుస్తున్నారు. ఈ పాయింట్‌ మీదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఈ వివాదాలు, వ్యవహారాల సంగతి అలా ఉంచితే…. ఏ పార్టీ అధికారంలో ఉన్నా… పదవులు ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం కాస్త అడ్వాంటేజ్ తీసుకుని గ్లాస్ పట్టుకుంటున్నారట. దాంతో ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న టిడిపి జనసేన లోకల్ లీడర్లు ఇట్స్ నాట్ కరెక్ట్ అంటున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?

OTR: కరపత్రాల యుద్ధానికి కారకులెవరు? తండ్రీ కొడుకులైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేని టార్గెట్‌...

மின் கொள்முதல்: “கூடுதல் செலவானாலும் மின்சாரம் வாங்க காரணம் இதுதான்" – அமைச்சர் நிர்மல் குமார்

தமிழ்நாடு அரசியலில் மின்சாரத்துறை ஒரு யூனிட் மின்சாரத்தை ரூ.35-க்கு வாங்கவிருக்கும் செய்தி...